బిజినెస్

జియో ఫోన్ వచ్చేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 21: ఇప్పటికే 4జి టెలికాం సేవలతో దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు 4జి ఆధారిత ఫీచర్ ఫోన్‌ను తెస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా మొబైల్ తయారీ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించింది. నిరుడు సెప్టెంబర్‌లో ప్రమోషన్ ఆఫర్‌లో భాగంగా 6 నెలల ఉచిత వాయిస్, డేటాతో పరిచయమైన జియో.. ప్రత్యర్థి సంస్థల ఆదాయానికి భారీగా గండి కొట్టినది తెలిసిందే. 130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారతీయ మార్కెట్‌లో స్వల్పకాలంలోనే 12.5 కోట్ల మంది కస్టమర్లను జియో సొంతం చేసుకుంది మరి. జియో దూకుడును తట్టుకునేందుకు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ వంటి దిగ్గజ సంస్థలూ తమ కాల్స్, డేటా చార్జీలను పెద్ద ఎత్తున తగ్గించాయి. అలాంటి రిలయన్స్ జియో.. ఇప్పుడు మొబైల్స్‌పై దృష్టి పెట్టింది. టెలికాం సేవల మాదిరిగానే మొబైల్స్‌నూ సంచలనాత్మకంగానే పరియం చేస్తోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 40వ వార్షిక భాగస్వాముల సమావేశం శుక్రవారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశానికి ముకేశ్ తల్లి కోకిలాబెన్‌తోపాటు భార్య నితా అంబానీ, కూతురు ఇషా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, చిన్న కుమారుడు అనంత్ అంబానీ అంతా కూడా హాజరయ్యారు. ఇప్పటికే నితా అంబానీ సంస్థలోకి ప్రవేశించగా, ఇప్పుడు ఇషా, ఆకాశ్ అంబానీలు తొలిసారిగా భాగస్వాముల ముందుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా ముకేశ్ మాట్లాడుతూ జియో 4జి ఫీచర్ ఫోన్లు కావాలనుకునేవారికి ఉచితంగానే అందిస్తామన్నారు. అయితే ముందుగా వన్-టైమ్ రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌గా 1,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ 1,500 రూపాయలను 36 నెలల తర్వాత వినియోగదారులకు తిరిగి చెల్లించనున్నారు. ఇక ఈ ఫోన్ గురించి ముకేశ్ కవల పిల్లలైన 25 ఏళ్ల కూతురు ఇషా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీలు సమావేశంలో లైవ్ డెమో ఇచ్చారు. ఫోన్ తీసుకున్నవారికి జీవితకాలం ఉచిత వాయిస్‌కాల్స్ సౌకర్యం ఉంటుందని, నెల రోజులకుగాను అపరిమిత డేటా ప్యాక్ 153 రూపాయలకే లభిస్తుందని చెప్పారు. ఆగస్టు 24 నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయని, బుక్ చేసుకున్నవారికి ‘ముందొచ్చినవారికి ముందిచ్చే’ పద్ధతిలో సెప్టెంబర్ నుంచి ఫోన్లను పంపిణీ చేస్తామన్నారు.
ఇక ప్రతివారం 50 లక్షల ఫోన్లను అందిస్తామన్న జియో.. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి ఇవి భారత్‌లోనే తయారవుతాయని స్పష్టం చేసింది. అయితే ఈ ఫోన్లను తయారుచేసే సంస్థ మాత్రం విదేశీ సంస్థేనని తెలిపింది. ఇదిలావుంటే ముకేశ్ అంబానీ గంటన్నరపాటు సమావేశంలో ప్రసంగించగా, ఆద్యంతం భాగస్వాములు, అతిథుల హర్షధ్వానాల మధ్య ఇది కొనసాగింది. 40 ఏళ్ల సంస్థ ప్రస్థానం గురించి ముకేశ్ మాట్లాడుతూ 1977లో 70 కోట్ల రూపాయల టర్నోవర్‌తో ఉన్న రిలయన్స్.. నేడు 3,30,000 కోట్ల రూపాయలకుపైగా టర్నోవర్‌ను నమోదు చేస్తోందన్నారు. చమురు, గ్యాస్, రిటైల్, టెలికాం, డిజిటల్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, పాదరక్షలు ఇలా విభిన్న రంగాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార, పారిశ్రామిక సామ్రాజ్యం విస్తరించినది తెలిసిందే. ఈ క్రమంలోనే సంస్థ టర్నోవర్ గడచిన 40 సంవత్సరాల్లో ఏకంగా 4,700 రెట్లు పెరిగింది. అలాగే సంస్థ లాభం కూడా 3 కోట్ల రూపాయల నుంచి దాదాపు 33,000 కోట్ల రూపాయలకు ఎగిసింది. దీంతో 10,000 రెట్లు వృద్ధి చెందినట్లైంది. ఆస్తులు సైతం 20,000 రెట్లు ఎగబాకి 33 కోట్ల రూపాయల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలకుపైగా పెరిగాయి. ప్రస్తుతం ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల రూపాయలకుపైగా ఉందని మకేశ్ భాగస్వాములందరికీ వివరించారు. 1977లో 1,000 రూపాయలు సంస్థలో పెట్టుబడిగా పెడితే, నేడు దాని విలువ 16,54,503 రూపాయలకు చేరుకుందన్నారు. ఈ 40 ఏళ్లలో 1,600 రెట్ల లాభం పెట్టుబడిదారులకు అందించామని ఆర్‌ఐఎల్ సారథి హోదాలో ముకేశ్ చెప్పుకొచ్చారు. అంటే ప్రతి రెండున్నర సంవత్సరాలకోసారి పెట్టిన పెట్టుబడి రెండింతలవుతూ వచ్చిందని పేర్కొన్నారు. మరో పదేళ్లలో ప్రపంచంలోని సంస్థల్లో ఆర్‌ఐఎల్‌ను 50వ అతిపెద్ద సంస్థగా నిలపాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఇటీవల విడుదలైన గణాంకాల్లో ఆర్‌ఐఎల్‌కు 106వ స్థానం దక్కినది తెలిసిందే. ఈ క్రమంలోనే రిలయన్స్ 50వ వార్షికోత్సవం నాటికి ప్రపంచ అతిపెద్ద సంస్థల్లో 50వ స్థానానికి రిలయన్స్‌ను చేర్చాలన్నదే తమ లక్ష్యమని ముకేశ్ చెప్పారు.
ఇక జియో గురించి మాట్లాడుతూ 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని, ప్రారంభం నాటి నుంచి ప్రతిరోజూ సెకనుకు ఏడుగురు కస్టమర్లు చేరుతూ వచ్చారని వివరించారు. కేవలం 6 నెలల్లో జియో డేటా వినియోగం నెలకు 20 కోట్ల గిగాబైట్ల (జిబి) నుంచి 120 కోట్ల గిగాబైట్లకు పెరిగిందన్నారు. మొబైల్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను భారత్ మించిందని చెప్పారు. జియో రాకకు ముందు డేటా వినియోగంలో భారత్ స్థానం 155గా ఉందని, నేడు మొదటి స్థానానికి చేరుకుందని వెల్లడించారు. మున్ముందూ ఈ స్థానంలోనే భారత్ ఉంటుందన్న విశ్వాసాన్ని ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా కనబరిచారు. ఇదిలావుంటే టెలికాం రంగంలో వైర్‌లెస్ సేవలతో దడ పుట్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇక ల్యాండ్‌లైన్ సేవలకూ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఫిక్స్‌డ్ లైన్ సర్వీసెస్‌పై దృష్టి పెట్టనున్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. దేశీయ ల్యాండ్ లైన్ సేవల్లో ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్, ప్రైవేట్‌రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ముందున్నది తెలిసిందే. అలాగే డైరెక్ట్ టు హోమ్, వీడియో ఆన్ డిమాండ్ సర్వీసెస్ సేవలనూ అందుబాటులోకి తెస్తోంది. ఫోన్ ద్వారా పొందే డేటా సేవలను టెలివిజన్‌తో కనెక్ట్ అయ్యేలా కేబుల్‌నూ తెస్తోంది. దీనివల్ల పెద్ద స్క్రీన్‌లో ఇంటర్నెట్‌ను కస్టమర్లు ఆస్వాదించవచ్చని ముకేశ్ చెప్పారు. కాగా, రాబోయే ఏడాది కాలంలో దేశంలోని 99 శాతం జనాభాకు జియో సేవలు అందుబాటులోకి వస్తాయన్న ఆయన భారత్‌లో 78 కోట్ల మందికి మొబైల్స్ ఉన్నాయని, అందులో 50 కోట్ల మందికి ఫీచర్ మొబైల్స్ ఉన్నప్పటికీ ఇంటర్నెట్ లేదా డేటాను వాడుకోలేకపోతున్నారని చెప్పారు. అయితే తాము తీసుకొచ్చే 4జి ఫీచర్ ఫోన్‌తో వీరంతా ఇంటర్నెట్ వినియోగదారులవుతారన్నారు. ఉచితంగానే ఫోన్ రావడం, తక్కువ ధరకే డేటా లభించడం ఇందుకు కారణమన్నారు. మరోవైపు 8 సంవత్సరాల తర్వాత శుక్రవారం మళ్లీ బోనస్ షేర్లను రిలయన్స్ ప్రకటించింది. 2009 అక్టోబర్‌లో 1:1 నిష్పత్తిలో రిలయన్స్ తమ భాగస్వాములకు షేర్లను జారీ చేసింది. అప్పట్నుంచి బోనస్ షేర్ల జోలికి వెళ్లలేదు. కానీ 40వ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి 1:1 నిష్పత్తిలో షేర్లను బోనస్‌గా అందించింది. దీన్ని దేశంలోనే అతిపెద్ద బోనస్ ఇష్యూగా ముకేశ్ అభివర్ణించారు. కాగా, అంతకుముందు 1997 సెప్టెంబర్‌లో కూడా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చిన రిలయన్స్.. 1983 అక్టోబర్‌లో మాత్రం 3:5 నిష్పత్తిలో భాగస్వాములకు షేర్లను బోనస్‌గా అందించింది.
ప్రభుత్వ లెవీలను తప్పించుకోడానికే
జియో 4జి ఫోన్ ప్రకటనను టెలికాం పరిశ్రమ సంఘం సిఒఎఐ తెలివైన ప్రకటనగా అభివర్ణిం చింది. లైసెన్సు ఫీజు, ఇతరత్రా ప్రభుత్వ లెవీలను తప్పించుకునేందుకు ఇది ఓ చక్కని మార్గంగా సిఒఎఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ పేర్కొన్నారు. ఒకవిధంగా తాజా ప్రకటనతో ప్రభు త్వానికి చేరాల్సిన ఆదాయాన్ని తస్కరించినట్లు గానే అభిప్రాయపడ్డారు. మరోవైపు రిలయన్స్ నిర్ణయం తమ మార్కెట్‌ను దెబ్బతిస్తుందని పలు మొబైల్ తయారీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయ.

చిత్రాలు.. ఆర్‌ఐఎల్ 40వ వార్షికోత్సవంలో ముకేశ్ అంబానీ సంతానం
*భార్య నితా అంబానీతో ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ