బిజినెస్

రైల్వే స్టేషన్లకు సోలార్ పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 22: రైల్వే స్టేషన్లలో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. రానున్న రోజుల్లో దీనిని సాధ్యం చేసేందుకు రైల్వే బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. భారతీయ రైల్వేలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఇప్పటికే అనేకసార్లు కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరిపింది.
అయితే తొలుత దేశంలో ముఖ్యమైన పట్టణ, నగరాలకు చెందిన రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భారతీయ రైల్వేలో దాదాపు 1,400 రైల్వే స్టేషన్లు ఉండగా, వీటిలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లకు సోలార్ వెలుగులు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేబోర్డు ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు చెందిన విశాఖ రైల్వే స్టేషన్‌కు సోలార్ పవర్ రానుంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధమైంది. అయితే సోలార్ పవర్‌ను అందించాలంటే ఇది భారీ ప్రాజెక్టు అయినందున టెండర్లను పిలిచి తక్కువ కోట్ చేసే ప్రత్యేక ఏజెన్సీ ద్వారా రైల్వే స్టేషన్లకు సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే నిర్ణయించింది.
ఒక యూనిట్ విద్యుత్‌కు ఆరు రూపాయల వరకు రైల్వే చెల్లిస్తోంది. అందువల్ల దీని కంటే తక్కువ ధరకు సోలార్ పవర్‌ను అందించగలిగితేనే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి ఇస్తామంటూ రైల్వే స్పష్టం చేసింది. కనీస చార్జీగా ఐదు రూపాయలు, లేదంటే అంతకంటే తక్కువుగా ఇవ్వాల్సిందిగా వాల్తేరు డివిజన్ తరపున ఒక ఏజెన్సీకి సూచించింది. అయితే దీనికి ఈ ఏజెన్సీ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో చర్చలతో సరిపెట్టింది. విశాఖ రైల్వే స్టేషన్, మర్రిపాలెం డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రికల్ లోకోషెడ్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం తదితర ఆరు ముఖ్యమైన చోట్ల సోలార్ పవర్ అవసరాన్ని గుర్తించిన వాల్తేరు డివిజన్ అధికారులు వీటికి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వేకు పంపడంతోపాటు ఏజెన్సీతోనూ చర్చించారు. ఈ అంశం కొలిక్కి వస్తే త్వరలో సోలార్ పవర్ ప్రాజెక్టుకు చెందిన పనులు ప్రారంభమవుతాయి. కాగా, సికింద్రాబాద్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసినా తొలి దశలోనే ఇది విఫలమైంది. అనేక సాంకేతికపరమైన సమస్యల కారణంగా దీనిపై రైల్వే ప్రత్యేక దృష్టి సారించ లేకపోయింది. కానీ విశాఖలో ప్రభుత్వరంగ సంస్థల్లోను, గృహాలు, పరిశ్రమల్లోను సోలార్ పవర్ 30 నుంచి 40 శాతం మేర అందుబాటులోకి వచ్చింది. స్వచ్ఛ భారత్‌లోను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిన విశాఖ రైల్వే స్టేషన్‌కు సోలార్ వెలుగులు తప్పనిసరి కానున్నాయి.
అందువల్ల స్టేషన్‌తోపాటు, రైల్వే కార్యాలయాల్లోను ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ ఉన్నతాధికారులు సంకల్పించారు. ఇందులోభాగంగా ముందుకు వచ్చే ఏజెన్సీలతో సంప్రదించి సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని డివిజన్ అధికారులు నిర్ణయించారు. ఇక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే దేశంలోనే ఇది తొలిసారి కానుంది. ఇది రావడం వలన ప్రతి ఏడాది 80 లక్షల నుంచి కోటి రూపాయల మేర ఆదా చేయవచ్చని జోన్ అధికారులు లెక్కలు కడుతున్నారు.
అంతేగాక సోలార్ పవర్ వినియోగం వల్ల పర్యావరణానికి మేలు చేసినట్లవుతుందని, సౌరశక్తి అనేది ఎప్పటికీ తరగనిదని నిపుణులు అంటు న్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా థర్మల్ విద్యుత్ తయారీని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయ. నిజానికి కాలుష్యకారక థర్మల్ విద్యుదుత్పత్తిపై అంతర్జాతీయ స్థాయలోనే వ్యతిరేక త వ్యక్తమవుతోంది. దీంతో పర్యావరణహిత సౌర, పవన విద్యుదుత్పత్తి విస్తరణపై కేంద్రం దృష్టి సారించింది. జల విద్యుదుత్పత్తికి తగినంత నీటి వనరులు లేకపోవడంతో ముఖ్యంగా సోలార్ పవర్ జనరేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తగిన రాయతీలనూ ప్రకటిస్తుండటంతో ఏ రకంగా చూసినా.. సోలార్ పవర్ ఉత్తమమేనన్న అభిప్రా యాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయ.