బిజినెస్

స్వదేశీ పరిజ్ఞానంతో సూపర్ కంప్యూటర్ల తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: కేంద్రంలోని మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా దేశంలో సూపర్ కంప్యూటర్లను తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు దశల్లో వీటి తయారీ ఉంటుందని వారు స్పష్టం చేశారు.
జాతీయ సూపర్ కంప్యూటర్ మిషన్‌లో భాగంగా మొదటి రెండు దశల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ స్విచ్‌లు, స్వదేశీ కంప్యూట్ నోడ్స్ వంటి వాటి డిజైన్, సబ్‌సిస్టమ్స్ ఉత్పత్తిపై దృష్టి పెడతామని సదరు అధికారులు వివరించారు. 4,500 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుకు నిరుడు మార్చిలోనే ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఆమోదం లభించింది.