బిజినెస్

ఈసారి దేశ జిడిపి వృద్ధిరేటు 7.5 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: దేశ జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో 7.5 శాతంగా నమోదు కావచ్చని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అంచనా వేశారు. అయినప్పటికీ దేశంలో ఉద్యోగ, ఉపాధి కల్పన పెద్ద సవాల్‌గానే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం రిఫైనరీ, ఫార్మాస్యూటికల్స్, ఐటి ఆధారిత సేవలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించలేకపోతుండటం దురదృష్టకరంగా అభివర్ణించారు.
కాగా, గత వారం ఐక్యరాజ్యసమితి ఉన్నతస్థాయి రాజకీయ మండలికి సుస్థిర అభివృద్ధి-2017పై భారత్‌కు సంబంధించి స్వచ్ఛంద జాతీయ సమీక్షా నివేదికను పనగరియా సమర్పించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అమలు పరచాల్సిన వాటిపై ఈ నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా రూపొందించారు.