బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరిగిన పర్సిస్టెంట్ సిస్టమ్స్ లాభం
న్యూఢిల్లీ, జూలై 23: పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 75 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016- 17) ఏప్రిల్-జూన్‌లో ఇది 73.28 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 728 కోట్ల రూపాయలుగా, పోయినసారి 701.77 కోట్ల రూపాయలుగా ఉంది.
యునైటెడ్ స్పిరిట్స్ లాభం రూ. 63 కోట్లు
న్యూఢిల్లీ, జూలై 23: యునైటెడ్ స్పిరిట్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో గతంతో పోల్చితే 44 శాతం పెరిగి 63 కోట్ల రూపాయలుగా నమోదైంది. అమ్మకాలు పడిపోయనా, తగ్గిన వడ్డీ భారం లాభాలను పెంచింది. ఆదాయం ఈసారి 13 శాతం క్షీణించి 1,782 కోట్ల రూపాయలుగా ఉంది.
క్షీణించిన 3ఐ ఇన్ఫోటెక్ లాభం
న్యూఢిల్లీ, జూలై 23: 3ఐ ఇన్ఫోటెక్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 8.01 కోట్ల రూపాయలుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్- జూన్‌లో 19.13 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 246.93 కోట్ల రూపాయలుగా, నిరుడు 257.29 కోట్ల రూపాయలుగా ఉంది.
నష్టాల్లో ఆమ్‌టెక్ ఆటో
న్యూఢిల్లీ, జూలై 23: ఆమ్‌టెక్ ఆటో స్టాండలోన్ నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో 889.58 కోట్ల రూపాయలుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్- జూన్‌లో నష్టం 319.68 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 504.91 కోట్ల రూపాయలుగా, పోయినసారి 446.84 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది.