బిజినెస్

త్రిఫల షర్బత్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 23: సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగించే త్రిఫల షర్బత్ దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. గిరిజన సహకార సంస్థ (జిసిసి) బ్రాండ్ ద్వారా వస్తున్న త్రిఫల షర్బత్.. కరక్కాయ, తానికాయ వంటి అటవీ ఉత్పత్తులతో తయారవుతోంది. ఈ నెల 26వ తేదీన దీన్ని ఆంధ్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రారంభిస్తారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో దీన్ని మార్కెటింగ్ చేస్తారు. కాగా, 750 ఎంఎల్ త్రిఫల షర్బత్ సీసాను కేవలం 160 రూపాయలకే విక్రయించాలని జిసిసి నిర్ణయించింది. తొలి దశలోనే లక్ష లీటర్ల వరకు మార్కెట్‌లో విక్రయించడం ద్వారా ఆదరణను పెంచుకోవాలని నిర్ణయించిన సంస్థ త్వరలోనే దేశవ్యాప్తంగా మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. తానికాయ, కరక్కాయ, ఉసిరి వంటి వాటి నుంచి తీసిన ద్రావకంలో కాస్తంత తేనే, చక్కెర మిశ్రమాలను కలిపి తయారు చేసే దీన్ని సేవించడం ద్వారా ఉల్లాసాన్ని పొందగలుగుతారు. చిన్నచిన్న రుగ్మతలను మటుమాయం చేయగలిగే శక్తి త్రిఫల షర్బత్‌లో ఉంటుంది. అయతే దీని ప్రయోజనాలు, ఏ విధంగా ఉపయోగించాలి? వంటి వివరాలు షర్బత్ సీసాపైన ముద్రిస్తామని సంస్థ తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఏపి, ఇతర రాష్ట్రాల్లో త్రిఫల చూర్ణం ప్యాకెట్లను జిసిసి విక్రయస్తోంది. ఈ క్రమంలో త్రిఫల షర్బత్‌ను ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే స్టాల్స్, ప్రత్యేక కౌంటర్లు, సూపర్ మార్కెట్లు, మాల్స్‌ల ద్వారా తొలిదశలో విక్రయించాలని జిసిసి ఆలోచన చేస్తోంది. క్రమేపి దశలవారీగా అన్నిచోట్లకు ఈ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు నన్నారి టెట్రా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఫ్రూటీ తరహాలో ఉండే నన్నారి టెట్రా ప్యాక్‌ను సామాన్యులకు సైతం అందుబాటులో ఉంచాలనే దీని ధరను కేవలం 15 రూపాయలుగా జిసిసి నిర్ణయంచింది. తద్వారా భారీగా విక్రయాలు సాగించాలని సంస్థ యోచిస్తోంది. ఈ రెండింటిని ఒకేరోజు విజయవాడ వేదికగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎఎస్‌పిఎస్ రవి ప్రకాష్ తెలిపారు. కాగా, దళారీ వ్యవస్థను నిర్మూలించి గిరిజన కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వీలుగా నిర్వహిస్తున్న ‘కాఫీ ప్రాజెక్టు’ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అలాగే జిసిసి పెట్రోల్ బంక్‌లు, వీటికి అనుసంధానం చేస్తూ నిర్వహించే సూపర్‌మార్కెట్‌ల ద్వారా గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఇటువంటి అనేక పథకాలు రెండేళ్ళ కాలంలో విజయవంతంగా నిర్వహించడం ద్వారా వార్షిక ఆదాయాన్ని 300 కోట్ల రూపాయలకుపైగా పెంచుకోగలిగామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో దీనిని 375 కోట్ల రూపాయలకు పెంచుకోవాలని లక్ష్యంగా చేసుకున్నామని రవి ప్రకాష్ అన్నారు. ఇందుకోసం కొంతకాలంగా రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు జిసిసి కుంకుమను సరఫరా చేస్తున్నామని, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే జిసిసి బ్రాండ్‌తో అందుబాటులోకి తీసుకువస్తున్నందున డిమాండ్ ఏర్పడిందన్నారు. ఇదే తరహాలో త్రిఫల షర్బత్, నన్నారి టెట్రా ప్యాక్‌లకూ ఆదరణ లభించగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.