బిజినెస్

ఆల్‌టైమ్ హైకి స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 24: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ రెండూ కూడా నూతన శిఖరాలను అధిరోహించాయి.
ముఖ్యంగా నిఫ్టీ 10,000 పాయింట్లకు కూతవేటు దూరంలో నిలిచిపోయింది. చమురు, గ్యాస్, ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లు మదుపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎమ్‌ఎఫ్.. భారత జిడిపి వృద్ధిరేటును 7.2 శాతం వద్ద యథాతథంగా ఉంచడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది.
ఈ క్రమంలోనే సెనె్సక్స్ 216.98 పాయింట్లు ఎగిసి 32,245.87 వద్ద ముగియగా, నిఫ్టీ 51.15 పాయింట్లు ఎగబాకి 9,966.40 వద్ద స్థిరపడింది. ఫలితంగా మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ హైల వద్ద నిలిచినట్లైంది. ఇక ఒకానొక దశలో సెనె్సక్స్ 32,320.86 పాయింట్లు, నిఫ్టీ 9,982.05 పాయింట్ల గరిష్ఠ స్థాయిని అందుకున్నాయి. నిజానికి ఉదయం ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడాయ. చివరి వరకు ఆ జోష్‌ను కొనసాగించాయ.
అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో కీలక సూచీలు మిశ్రమంగా ముగిస్తే, ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలు నష్టాల్లో కదలాడాయి.