బిజినెస్

నవ్యాంధ్ర ఐటిపై విద్యుత్ చార్జీల భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 27: నవ్యాంధ్ర రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు నష్టాల బాట పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలకు రావల్సిన రాయితీలు రాకపోగా, విద్యుత్ ఛార్జీలు ఐటి కంపెనీలకు భారంగా పరిణమిస్తున్నాయి. తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నా.. ఒక యూనిట్‌ను 9.50 నుంచి 10 రూపాయలతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని చాలా కాలం క్రిందటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా, పెద్దగా ఫలితం లేకపోవడంతో ఐటి కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. దేశంలోనే తక్కువ నష్టాలు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఈపిడిసిఎల్) కూడా ఇతర డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మాదిరి భారీగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తోంది. వాస్తవానికి ఈపిడిసిఎల్, ఎస్‌పిడిసిఎల్ యూనిట్‌కు 6.50 రూపాయలు వసూలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి మూడు రూపాయల అదనపు ఛార్జీలు తోడవుతున్నాయి. అంటే యూనిట్ కనీస ధర 9.50 రూపాయలు అవుతోందన్నమాట. కాగా, ఇండివిడ్యువల్ పవర్ ప్రొడ్యూసర్స్ నుంచి ఐటి కంపెనీలు విద్యుత్ కొనుగోలు చేసుకోడానికి అవకాశం ఉంది. ఓపెన్ యాక్సిస్ పాలసీ క్రింద ఇది సాధ్యపడుతుంది. ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్స్ నుంచి యూనిట్ 4 నుంచి 4.50 రూపాయలకు లభిస్తోంది. కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయకపోయినా, ఐటి కంపెనీల నుంచి మినిమమ్ ఛార్జీలు వసూలు అవుతున్నాయ. కేవలం మినిమం ఛార్జీల భారం ఒక్కో కంపెనీపై లక్ష నుంచి లక్షన్నర వరకూ పడుతోంది. అప్పుడు ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్స్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినా ఫలితం ఉండదని ఐటి యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈ మినిమమ్ ఛార్జీల వలన ఒక్కో ఐటి కంపెనీకి సంవత్సరానికి 50 నుంచి 60 లక్షల రూపాయల అదనపు భారం పడుతోంది. దీంతో తమకు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని ఐటి కంపెనీల యాజమాన్యాలు కోరుతున్నాయి. సెంట్రల్ గ్రిడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌ను 2.78 రూపాయలకు కొనుగోలు చేస్తోంది. రాష్ట్రానికి వచ్చే విద్యుత్‌లో 20 శాతం ఉచిత విద్యుత్‌కు ఖర్చవుతోందనుకున్నా.. కేవలం ఐదు శాతం ట్రాన్సిమిషన్ లాస్, నాలుగు శాతం డిస్ట్రిబ్యూషన్ లాస్‌తో దేశంలోనే ఈపిడిసిఎల్ మొదటి స్థానంలో ఉంది. మరో పది శాతం కంపెనీ ఓవర్ హెడ్స్ ఉన్నాయనుకుంటే, ఇవన్నీ కలిపి 40 శాతానికి చేరుకుంటాయి. సెంట్రల్ గ్రిడ్ నుంచి వచ్చే ధరకు 40 శాతం నష్టాలు కలుపుకొన్నా, యూనిట్‌ను నాలుగు నుంచి ఐదు రూపాయలకు కనీసం ఐటి కంపెనీలకైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాయితీలు ఏవీ?
రాష్ట్రంలో ఐటి కంపెనీలకు గడచిన మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి రావల్సిన రాయితీలు అందడం లేదు. ఒక అభ్యర్థికి ఐటి కంపెనీలో ఉద్యోగం ఇస్తే, ఆ అభ్యర్థి శిక్షణ నిమిత్తం ప్రభుత్వం 7,500 రూపాయలు మంజూరు చేస్తుంది. కానీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించడం లేదు. కాగా, 2014-19 ఐటి పాలసీ ప్రకారం 2014కి ముందు స్థాపించిన ఐటి కంపెనీలకు మాత్రమే ఇటువంటి రాయితీలు వరిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
ఐటి కంపెనీలకు ‘ఫైబర్ నెట్’ ఇవ్వాలి
ఇక ఐటి కంపెనీలు ప్రధానంగా వినియోగించే ఇంటర్నెట్ ధరలు కూడా భారంగా పరిణమిస్తున్నాయి. 1:1 100 ఎంబిపిఎస్‌ను లక్ష రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదే ఏపి ఫైబర్ నెట్ సౌకర్యాన్ని ఐటి కంపెనీలకు ఇవ్వగలిగితే, కేవలం 15 వేల రూపాయలకే లభిస్తుంది. ఈ విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవరసం ఉంది.