బిజినెస్

ప్రపంచ ధనవంతుల్లో అమెజాన్ అధినేతకు అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 27: ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ డాట్‌కామ్ యజమాని జెఫ్ బెజోస్.. ప్రపంచ సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో 2013 నుంచి 61 ఏళ్ల బిల్‌గేట్స్ తొలి స్థానంలోనే ఉంటుండగా, ఈ ఏడాది మాత్రం 53 ఏళ్ల జెఫ్ బెజోస్ ఆ స్థానంలోకి వచ్చినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గురువారం తెలిపింది. 91 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ ఈ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, 90 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక టాప్-10లో అమన్సియో ఒర్టెగా (82.7 బిలియన్ డాలర్లు) మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాత వరుసగా వారెన్ బఫెట్ (74.5 బిలియన్ డాలర్లు), మార్క్ జూకర్‌బర్గ్ (56 బిలియన్ డాలర్లు), కార్లోస్ స్లిమ్ (54.4 బిలియన్ డాలర్లు), లర్రి ఎల్లిసన్ (52 బిలియన్ డాలర్లు), చార్లెస్ కోచ్ (48 బిలియన్ డాలర్లు), డేవిడ్ కోచ్ (48 బిలియన్ డాలర్లు), మైఖేల్ బ్లూంబర్గ్ (47.5 బిలియన్ డాలర్లు) ఉన్నారు. ఇదిలావుంటే న్యూయార్క్ మార్కెట్‌లో ఉదయం ట్రేడింగ్‌లో అమెజాన్ డాట్‌కామ్ షేర్ విలువ 1.8 శాతం ఎగిసి 1,071.31 డాలర్లకు చేరింది. దీంతో బెజోస్ వ్యక్తిగత సంపద 91 బిలియన్ డాలర్లను మించిపోయింది. అమెజాన్ కూడా భారీ లాభాలను సొంతం చేసుకుంటుండటంతో బెజోస్ సంపద అంతకంతకూ పెరిగిపోతోంది.
మరోవైపు ఫోర్బ్స్ ఆసియా 2017 జాబితాలో మూడు భారతీ సంస్థలకు చోటు లభించింది. 675 మిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మన్‌పసంద్‌కు, 257 మిలియన్ డాలర్ల మార్కెట్ విలువున్న 8కె మైల్స్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌కు, 77 మిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన కెల్టన్ టెక్ సొల్యూషన్స్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. మన్‌పసంద్ సంస్థ వడోదరకు చెందినదవగా, 8కె మైల్స్ చెన్నైకి, కెల్టన్ టెక్ హైదరాబాద్‌కు చెందిన సంస్థలు.
ఇకపోతే తాజా ఫోర్బ్స్ సింగపూర్ ధనవంతుల జాబితా 2017లో ఆ దేశంలోని 50 మంది సంపద నిరుడుతో పోల్చితే 11 శాతం పెరిగింది. వీరి సంపద విలువ 104.6 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ గురువారం పేర్కొంది.