బిజినెస్

జియో ధాటికి పెరిగిన ఐడియా నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 815.9 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 217.1 కోట్ల రూపాయల లాభాన్ని ఐడియా అందుకుంది. ఆదాయం కూడా ఈసారి దాదాపు 14 శాతం క్షీణించి 8,181.7 కోట్ల రూపాయలకు పరిమితమైంది. పోయినసారి 9,552.4 కోట్ల రూపాయలుగా ఉంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికాం సంస్థ రిలయన్స్ జియో రాకతో ఇతర టెలికాం సంస్థల ఆదాయం భారీగా తగ్గిపోయినది తెలిసిందే. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలోనూ ఐడియా 325.6 కోట్ల రూపాయల నష్టాలపాలైంది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థల ఆదాయం కూడా జియో దెబ్బకు గణనీయంగా పడిపోగా, లాభాలు భారీ గా తగ్గుముఖం పట్టాయి. నిరుడు సెప్టెంబర్‌లో 4జి సేవలను జియో పరిచయం చేయగా, ఈ ఏడాది మార్చి ఆఖరు వరకు దేశవ్యాప్తంగా ఉచితంగానే 4జి సేవలను జియో వినియోగదారులకు అందించింది. దీంతో ఇతర సంస్థల అమ్మకాలు సహజంగానే పడిపోయాయి. ఆ తర్వాత కూడా వివిధ ఆఫర్లతో తక్కువ ధరలకే 4జి సేవలను జియో అందిస్తుండగా, దాని వినియోగదారులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాసహా ఇతర సంస్థలూ తమ సేవల ధరలను తగ్గించాల్సి వస్తోంది. దీంతో ఆదాయం పడిపోయి.. లాభాలు తగ్గడమో, నష్టాలు వాటిల్లడమో జరుగుతోంది.