బిజినెస్

భారీగా క్షీణించిన డాక్టర్ రెడ్డీస్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔషధ రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 53 శాతం క్షీణించి 59.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 126.3 కోట్ల రూపాయలుగా ఉందని గురువారం సంస్థ తెలిపింది. ఆదాయం ఈసారి 3,316 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 3,235 కోట్ల రూపాయలుగా ఉందని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ స్పష్టం చేసింది.
హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాభం రూ. 2,171 కోట్లు
ఐటి రంగ సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 6.1 శాతం పెరిగి 2,171 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 2,047 కోట్ల రూపాయలుగా ఉందని గురువారం సంస్థ తెలిపింది. ఆదాయం ఈసారి 12,149 కోట్ల రూపాయలుగా, పోయినసారి 11,336 కోట్ల రూపాయలుగా ఉంది.
తగ్గిన గ్యాస్ ధరలతో దిగిన ఒఎన్‌జిసి లాభం
ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువు అనే్వషణ, ఉత్పతాదక సంస్థ ఒఎన్‌జిసి నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 8.2 శాతం దిగజారి 3,884.73 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్ లో ఇది 4,232.54 కోట్ల రూపాయలుగా ఉందని గురువారం సంస్థ తెలిపింది. అయతే నిరుడుతో చూస్తే ఆదాయం మాత్రం ఈసారి 17,784.75 కోట్ల రూపాయల నుంచి 19,073.54 కోట్ల రూపాయలకు పెరిగింది. సహజ వాయువు ధరలు తగ్గడమే లాభాల క్షీణతకు కారణంగా సంస్థ పేర్కొంది.
7 శాతం పెరిగిన ఐటిసి లాభం
బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసి స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 7.37 శాతం పెరిగి 2,560.50 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 2,384.67 కోట్ల రూపాయలుగా ఉందని గురువారం సంస్థ తెలిపింది. నికర అమ్మకాలు ఈసారి 13,722.21 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 13,156.68 కోట్ల రూపాయలుగా ఉన్నాయని ఐటిసి స్పష్టం చేసింది.