బిజినెస్

ఐసిఐసిఐ బ్యాంక్ లాభం రూ. 2,605 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 3.5 శాతం పెరిగి 2,604.73 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో బ్యాంక్ లాభం 2,515.85 కోట్ల రూపాయలుగా ఉందని గురువారం ఐసిఐసిఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక ఏకీకృత ఆదాయం ఈసారి 26,517.57 కోట్ల రూపాయలుగా ఉందని, పోయినసారి 24,483.75 కోట్ల రూపాయలుగా ఉందని బ్యాంక్ తెలియజేసింది. కాగా, స్టాండలోన్ ఆధారంగా చూస్తే ఈసారి లాభం 8.2 శాతం క్షీణించి 2,049 కోట్ల రూపాయలుగా, ఆదాయం 16,847.04 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు లాభం 2,232.35 కోట్ల రూపాయలుగా, ఆదాయం 16,759.51 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే స్థూల నిరర్థక ఆస్తులు లేదా మొండి బకాయిలు ఈ ఏడాది జాన్ 30 నాటికి 7.99 శాతం పెరిగాయి. నిరుడు జూన్ 30 నాటికి ఇవి 5.28 శాతం వద్దే ఉన్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది.