బిజినెస్

తెలంగాణలో పరిశ్రమలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో పెట్టుబడుల అవకాశాలు అనే సదస్సును ఎఫ్‌ట్యాప్సీ ఏర్పాటు చేసింది. ఈ సదస్సును శుక్రవారం ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదన్నారు. విద్యుత్ సమస్యలను రాష్ట్రం అవతరించిన మొదటి ఆరు నెలల్లోనే అధిగమించామన్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, పరిశ్రమలను, వివిధ సంస్థలను ఒకేచోట ఏర్పాటు చేయడం కంటే వివిధ ప్రాంతాల్లో నెలకొల్పడం వల్ల సంపద విస్తరిస్తుందన్నారు. దీనివల్ల ఆ రాష్ట్రం శరవేగంగా శక్తివంతమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులను వినూత్న పద్ధతుల్లో సృజనాత్మకత రంగాల్లో పెట్టాలన్నారు. బ్యాంకులు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు విరివిగా ఇవ్వాలన్నారు. పశు సంవర్ధక శాఖ, వ్యవసాయం, పరిశ్రమల రంగాలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు. విద్యార్థులకు విద్యా రుణాలను పెద్ద ఎత్తున ఇవ్వాలని సూచించారు. బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలతో ఏర్పాటు చేసిన పరిశ్రమలను నెలకోసారి సందర్శించాలన్నారు. ఆర్థికంగా పరిశ్రమలు గాడి తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిండికేట్ బ్యాంకు జనరల్ మేనేజర్ ఎస్‌ఏ శర్మ మాట్లాడుతూ తమ బ్యాంకు గత రెండు, మూడేళ్లుగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రుణాలు పెద్దఎత్తున ఇస్తోందని గుర్తుచేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్గదర్శకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ మణిమారన్, ఎఫ్‌టాప్సీ పన్నుల విభాగం చైర్మన్ కరుణేంద్ర తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఎఫ్‌ట్యాప్సీ సదస్సును ప్రారంభిస్తున్న ఈటల రాజేందర్