బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీగా పెరిగిన ఐడిఎఫ్‌సి బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ, జూలై 28: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో గతంతో పోల్చితే 65.3 శాతం పెరిగి 437.59 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 264.76 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 2,793.98 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,188.6 కోట్ల రూపాయలుగా ఉంది.
ఐడిఎఫ్‌సి లిమిటెడ్
ఐడిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 65.2 శాతం వృద్ధి చెంది 299.40 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 181.21 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 3,058.13 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,360.58 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
గ్లెన్‌మార్క్ ఫార్మా లాభం రూ. 333 కోట్లు
ఔషధ రంగ సంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మా ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 47 శాతం ఎగిసి 333.38 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 226.78 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 2,363 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,969.38 కోట్ల రూపాయలుగా ఉంది.
15 శాతం పెరిగిన రిలయన్స్ క్యాపిటల్ లాభం
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 15 శాతం పెరిగి 238 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 207 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 4,857 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 3,663 కోట్ల రూపాయలుగా ఉంది.
చోళమండలానికి కలిసొచ్చిన వడ్డీ ఆదాయం
ఆర్థిక సేవల సంస్థ చోళమండలం ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 25 శాతం ఎగిసి 207కోట్ల రూపాయలుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం పెరగడం వల్లే లాభాలు పెరిగాయని సంస్థ తెలిపింది. నిరుడు 7.1 శాతంగా ఉన్న నికర వడ్డీ ఆదాయం వృద్ధిరేటు.. ఈసారి 8 శాతంగా నమోదైందని సంస్థ వెల్లడించింది.
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాభం రూ. 189 కోట్లు
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 3.59 శాతం పెరిగి 189 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 196.05 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 2,389.57 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,279.93 కోట్ల రూపాయలుగా ఉంది.
స్వల్పంగా పెరిగిన కరూర్ వైశ్యా బ్యాంక్ లాభం
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే స్వల్పంగా 1.10 శాతం పెరిగి 147.97 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 146.35 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,620.38 కోట్ల రూపాయలుగా ఉండగా, పోయనసారి 1,547.31 కోట్ల రూపాయలుగా ఉంది.
మోతీలాల్ ఓస్వాల్ లాభం రూ. 101 కోట్లు
మోతీలాల్ ఓస్వాల్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 29 శాతం పెరిగి 101.6 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 79.2 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 576 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారితో పోల్చితే దాదాపు 58 శాతం అధికంగా నమోదైంది.