బిజినెస్

ఎల్‌అండ్‌టిలో కొత్త ఆర్డర్ల ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 46 శాతం ఎగిసి 893 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 610 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ శుక్రవారం తెలియజేసింది. ఏకీకృత ఆదాయం ఈసారి 23,990 కోట్ల రూపాయలుగా ఉందని, పోయినసారి కంటే 10 శాతం ఎగిసిందని ఎల్‌అండ్‌టి వెల్లడించింది. కాగా, ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 26,352 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు అందుకున్నామని చెప్పింది. ఇక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), రెరా అమలు, దివాళా చట్టం తదితర నిర్మాణాత్మక సంస్కరణలతో దేశ జిడిపి వృద్ధిరేటు పెరగగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టి వ్యక్తం చేసింది. ముఖ్యంగా నిర్మాణ రంగం పుంజుకోగలదన్న ఆశాభావం వెలిబుచ్చిన సంస్థ.. ఈ ఏప్రిల్-జూన్‌లో వౌలిక రంగంలో 10,539 కోట్ల రూపాయల కస్టమర్ రెవిన్యూను సాధించామని తెలిపింది. హైడ్రోకార్బన్ విభాగంలో 2,546 కోట్ల రూపాయలు, ఐటి, టెక్నాలజీ సేవల విభాగంలో 2,536 కోట్ల రూపాయలు, ఆర్థిక సేవల విభాగంలో 2,294 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని అందుకున్నట్లు తెలిపింది.