బిజినెస్

ఎల్‌ఐసికి ఈక్విటీ అమ్మకాల జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 28: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)కు ఈక్విటీ అమ్మకాలు కలిసొచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సంస్థ లాభం గతంతో పోల్చితే ఏకంగా 145 శాతం ఎగిసింది. 6,100 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో కేవలం 2,489 కోట్ల రూపాయల నికర లాభానే్న అందుకుంది. దేశంలోనే ఎల్‌ఐసి అతిపెద్ద సంస్థాగత మదుపరి అన్న విషయం తెలిసిందే. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఎల్‌ఐసికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే వాటాలున్నాయి. దీంతో ఈ వాటాల్లో కొంతమేర అమ్మకాలు జరపడంతో వచ్చిన నిధులు.. ఎల్‌ఐసి తొలి త్రైమాసికం లాభాలను పెంచాయి. ఇకపోతే మార్ట్‌గేజ్ లెండర్ ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్షియల్ నికర లాభం ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గతంతో పోల్చితే 15 శాతం పెరిగి 470 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం 408 కోట్ల రూపాయలుగా ఉంది. ఇకపోతే వ్యక్తిగత రుణ విభాగంలో ఈసారి 8,286 కోట్ల రూపాయల రుణాలు అందించామని ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్షియల్ ఈ సందర్భంగా తెలియజేసింది.