బిజినెస్

యెస్ బ్యాంకుకు ఉత్తమ సృజనాత్మక అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 5వ అతిపెద్ద బ్యాంకైన యెస్ బ్యాంకుకు ఆర్థిక విభాగంలో ప్రతిషాఠత్మకమైన ఉత్తమ సృజనాత్మక అవాఠ్డు లభించింది. ఖాతాదారులకు విశిష్టమైన ఆర్థిక ఉత్పత్తులతో కూడా సేవలు, పథకాలు అందిస్తున్నందుకుగాను ఈ అవార్డు లభించినట్లు యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ తెలిపారు. జర్మనీలోని కరిశ్రుహెలో జరిగిన అంతర్జాతీయ ఫైనాన్స్ సదస్సులో ఈ అవార్డుకుగాను కరిశ్రుహె ఫైనాన్స్ అనే సంస్థ యెస్ బ్యాంకును ఎంపిక చేసింది. స్థానిక సహకార బ్యాంకులకు పరపతిని సమకూర్చడం, పరపతిని పెంచడం, గుజరాత్‌లోని ఉప్పు రంగంలో పనిచేసే మహిళా కార్మికులకు పరపతిని ఇవ్వడంలో యెస్ బ్యాంకు ముందుంది. గుజరాత్‌లో పర్యావరణ పరిరక్షణకు ఉప్పు కార్మికులు దోహదపడేందుకు యెస్ బ్యాంకు ఆర్థికంగా చేయూత నిస్తోందని ఆ బ్యాంకు ఎండి రాణా కపూర్ తెలిపారు.