బిజినెస్

ఎఆర్‌సిలకు ఐబిసి చక్కని అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ సంస్థల (ఎఆర్‌సి)కు దివాళా చట్టం (ఐబిసి) ఓ చక్కని అవకాశం అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. ఎఆర్‌సిలతోపాటు ప్రైవేట్ ఈక్వీటీ సంస్థ (పిఇ)లతో శనివారం చర్చల సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ ఈ నిరర్థక ఆస్తులన్నీ కూడా కీలకమని, ఇవి కేవలం అదనపు ఉద్యోగాలను సృష్టించడమేగాక, జాతీయ ఉత్పాదక శక్తిని కూడా పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఇంటర్నల్ అడ్వైజరీ కమిటీ (ఐఎసి).. గత నెల 13న నిర్వహించిన సమావేశం తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలోని మొండి బకాయిల్లో 25 శాతానికి సమానమైన 12 ఖాతాలను దివాళా చట్టం క్రింద తక్షణమే సిఫార్సు చేసింది. దేశీయ బ్యాంకులకు మొత్తం 8 లక్షల కోట్ల రూపాయలకుపైగా మొండి బకాయిలుండగా, అందులో ఈ 12 ఖాతాల విలువే 25 శాతం (2 లక్షల కోట్ల రూపాయలు)తో సమానం. ఇక మొత్తం 8 లక్షల కోట్ల రూపాయల నిరర్థక ఆస్తుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే 6 లక్షల కోట్ల రూపాయలకుపైగా ఉన్నాయి. బడా వ్యాపార, పారిశ్రామిక సంస్థలన్నింటికీ దాదాపు వేల కోట్ల రూపాయల్లో అప్పులుండటం కలవరపెడుతోందిప్పుడు. అయితే పెద్ద మొత్తంలో ఉన్న ఈ మొండి బకాయిలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు ఎఆర్‌సిలకు నూతన వ్యాపారవకాశాలను కల్పిస్తున్నాయని జైట్లీ అన్నారు. బ్యాంకుల నుంచి, ఇతరత్రా ఆర్థిక సేవల సంస్థల నుంచి నిరర్థక ఆస్తులను ఎఆర్‌సిలు కొనుగోలు చేస్తాయన్నది తెలిసిందే.