బిజినెస్

జియో 4జి ఫోన్ ఇంటర్నెట్ సమానత్వంపై ఐడియా ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 30: రిలయన్స్ జియో ప్రతిపాదిత 4జి ఫోన్ల నేపథ్యంలో ఐడియా సెల్యులార్ ఇంటర్నెట్ సమానత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. సదరు ఫోన్‌లో జియోకు సంబంధించిన యాప్స్ మాత్రమే ఉంటాయని, వినియోగదారులు కోరుకునే యాప్స్‌కు చోటుండకపోవచ్చని దీనివల్ల నెట్ న్యూట్రాలిటీకి భంగం వాటిల్లొచ్చని అంటోంది. కాగా, జియో 4జి ఫీచర్ ఫోన్‌కు ధీటుగా తాము కూడా ఓ ఫీచర్ ఫోన్‌ను తీసుకొస్తామని ఐడియా చెబుతోంది. ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్ కూడా ఈ తరహా ఆలోచనకు శ్రీకారం చుట్టగా, వివిధ ఫీచర్ ఫోన్ల తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో సమీకరణాలు పూర్తిగా మారిపోయినది తెలిసిందే. నిరుడు సెప్టెంబర్‌లో జియో సేవలు మొదలవగా, ఉచిత 4జి సేవలను దేశవ్యాప్తంగా అమలు చేసి.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర సంస్థల ఆదాయానికి భారీగానే గండి కొట్టింది.