బిజినెస్

నవంబర్‌లో కియో పరిశ్రమకు భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి, జూలై 30: అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కియో కార్ల పరిశ్రమకు నవంబర్ నెలలో భూమిపూజ చేయనున్నట్లు నవ్యాంధ్ర రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంత్రి పరిటాల సునీతతో కలిసి దేవినేని ఉమా ఆదివారం అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం దేవినేని ఉమా మాట్లాడుతూ కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాకు కియో కార్ల పరిశ్రమ ఒక వరం అన్నారు.
జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉన్న అపార అభిమానాన్ని ఈ పరిశ్రమ గుర్తుచేస్తుందన్నారు. కియో కార్ల పరిశ్రమలో దాదాపు 13 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి నుంచి వారి విద్యార్హతను బట్టి 8 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు వేతన సదుపాయం ఉంటుందన్నారు.