బిజినెస్

ఏపి పర్యాటక శాఖ సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 30: నవ్యాంధ్ర పర్యాటక శాఖకు మరో అంతర్జాతీయ స్థాయి అవార్డు లభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షిస్తుండటంతో రాష్ట్ర పర్యాటక శాఖకు వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి. ఇందులో భాగంగా ఐదో అంతర్జాతీయ పర్యాటక, ప్రయాణాల అవార్డుల సదస్సు వేదికగా రాష్ట్ర పర్యాటక శాఖకు ‘బెస్ట్ అవార్డ్ ఫర్ మేనేజ్డ్ టూరిస్ట్ డెస్టినేషన్-ఆంధ్రప్రదేశ్ టూరిజం’ పేరిట ప్రత్యేక పురస్కారాన్ని ఢిల్లీలో శనివారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ పూర్వ కార్యదర్శి వినోద్ జుట్సి, ఐటిసిటిఎ చైర్మన్, మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అజయ్‌గుప్తా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ పురస్కారాన్ని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సమాచార కేంద్రం ఉప సంచాలకులు, ఎపిఐసి ప్రత్యేకాధికారి కంచర్ల జయరావు, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సి వీరేంద్ర అందుకున్నారు.