బిజినెస్

జిఎస్‌టితో ఆర్థిక వ్యవస్థ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)తో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని రాష్ట్రాలన్నీ భాగస్వాములైన ఈ చారిత్రక బిల్లుతో సమాఖ్య ప్రభుత్వ ఔన్నత్యం తెలుస్తోందన్నారు. నెలనెలా నిర్వహించే మన్ కి బాత్ కా ర్యక్రమంలో భాగంగా ఆదివారం రేడియోలో మాట్లా డుతూ జిఎస్‌టి అమలు చక్కగా కావడానికి దేశ ప్రజలం తా కలిసి వచ్చారన్నారు. కాగా, ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానంలో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.