బిజినెస్

స్టాక్ మార్కెట్లకు లాభాల కిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 31: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం మరో సరికొత్త రికార్డును చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు మదుపరులను ఆకట్టుకుంటుండటంతో పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. అదీగాక బుధవారం జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించనుందన్న అంచనాలు కూడా మదుపరులను కొనుగోళ్ల వైపునకు నడిపించాయి. దీంతో సూచీలు లాభాల్లో కదలాడుతుండగా, రోజుకో రికార్డు నమోదవుతోంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 205.06 పాయింట్లు పుంజుకుని 32,514.94 వద్ద స్థిరపడింది.
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 62.60 పాయింట్లు అందుకుని 10,077.10 వద్ద నిలిచింది. దీంతో గత వారం గురువారం రోజున నమోదైన రికార్డులు కనుమరుగైనట్లైంది. నాడు సెనె్సక్స్ 32,383.30 పాయింట్లు, నిఫ్టీ 10,020.65 పాయింట్ల వద్ద ముగిశాయి. తాజాగా ఈ స్థాయిలను సూచీలు అధిగమించగా, సరికొత్త ఆల్‌టైమ్-హై రికార్డులు నమోదయ్యాయి. ఇక సోమవారం ట్రేడింగ్‌లో కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ షేర్లు 1.86 శాతం లాభపడగా, మెటల్, పిఎస్‌యు షేర్లు కూడా లాభాలను అందుకున్నాయి.