బిజినెస్

సహారా లైఫ్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: సహారా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని టేకోవర్ చేసుకోవాలంటూ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ను బీమా రంగ నియంత్రిత వ్యవస్థ ఐఆర్‌డిఎఐ ఆదేశించడంపై సోమవారం సహారా గ్రూప్.. సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్)కు వెళ్లింది. దీనిపై శాట్ స్టే విధించగా, ఆగస్టు 7కు తదుపరి విచారణను వాయదా వేసింది. ఫలితంగా సహారా లైఫ్‌కు వారం రోజులపాటు ఊరట లభించినట్లైంది. ఈ వ్యవహారంపై తాము న్యాయ పోరాటం చేస్తామని ఆదివారం సుబ్రతా రాయ్ నేతృత్వంలోని సహారా గ్రూప్ స్పష్టం చేసింది తెలిసిందే. ఐఆర్‌డిఎఐ నిర్ణయం దురదృష్టకరమని కూడా పేర్కొంది. కాగా, బీమా రంగ నిబంధనల ప్రకారం సహారా లైఫ్ నడవడం లేదని, దాని నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో సహారా గ్రూప్ చూసుకోలేదన్న అభిప్రాయానికి వచ్చిన ఐఆర్‌డిఎఐ.. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ద్వారా వాల్యుయేషన్ రిపోర్టును తెప్పించుకుంది. ఈ క్రమంలోనే సహారా లైఫ్‌ను ఐసిఐసిఐకి అప్పగించాలని భావించగా, దీనిపై ఐఆర్‌డిఎఐ చైర్మన్‌ను సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కలిశారు కూడా. తమకు కొంత గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారాయన. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు కోర్టుకు వెళ్లేందుకు సహారా సిద్ధమైంది.