బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్
నికర లాభం రూ. 2,052 కోట్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాండలోన్ లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 13.9 శాతం పెరిగి 2,052.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 1,801.7 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా ఈసారి వృద్ధి చెంది 7,181 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది. పోయనసారి 6,119.8 కోట్ల రూపాయలుగా ఉంది.
44 శాతం క్షీణించిన
జెఎస్‌డబ్ల్యు స్టీల్ నికర లాభం
జెఎస్‌డబ్ల్యు స్టీల్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 44.10 శాతం క్షీణించి 626 కోట్ల రూపాయలకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 1,120 కోట్ల రూపాయలుగా ఉంది. అయనప్పటికీ ఆదాయం ఈసారి 23.98 శాతం పుంజుకుని 15,977 కోట్ల రూపాయలకు చేరింది. పోయినసారి 12,886 కోట్ల రూపాయలుగా ఉందని జెఎస్‌డబ్ల్యు స్టీల్ సంస్థ తెలిపింది.
పిరామల్ ఎంటర్‌ప్రైజెస్
లాభం రూ. 247.46 కోట్లు
బహుళ వ్యాపార సంస్థ పిరామల్ ఎంటర్‌ప్రైజెస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 43.09 శాతం పెరిగి 247.46 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 172.93 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,337.91 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 1,829.23 కోట్ల రూపాయలుగా ఉంది.