బిజినెస్

ఫిక్కీ నూతన సెక్రటరీ జనరల్‌గా సంజయ్ బారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: పారిశ్రామిక, వ్యాపార సంఘం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) నూతన సెక్రటరీ జనరల్‌గా సంజయ్ బారు నియమితులయ్యారు. సెప్టెంబర్ 1న ఈ కొత్త బాధ్యతల్లోకి బారు వస్తారు. ఈ మేరకు ఫిక్కీ అధ్యక్షుడు పంకజ్ పటేల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల పదవీకాలం ముగిసిన దిదార్ సింగ్ స్థానంలో బారు వస్తున్నట్లు పటేల్ ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. కాగా, గతంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు సంజయ్ బారు మీడియా సలహాదారుగా వ్యవహరించారు. సంజయ్ బారు ప్రముఖ ఆర్థికవేత్తగా, జర్నలిస్టుగా కూడా సుపరిచితులేనన్నది తెలిసిందే.