బిజినెస్

ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా విద్యుత్ కనెక్షన్ విషయంలో నిబంధనలను సరళతరం చేస్తూ ప్రణాళికను రూపొందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించిన పారిశ్రామికవేత్త/వ్యాపారస్తుడు దరఖాస్తు చేసిన వారంలోగా విద్యుత్ కనెక్షన్‌కు అనుమతిస్తామని, అయతే రోడ్ల కట్టింగ్ తదితర పనుల ఖర్చును లబ్దిదారుడే భరించాల్సి ఉంటుందని మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏడు రోజుల్లోగా సంబంధిత శాఖల అనుమతి రాకపోతే, అనుమతి వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పేరుతో మంగళవారం విడుదలైన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.