బిజినెస్

కీలక వడ్డీరేట్లు తగ్గుతాయన్న ఆశతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 1: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డు పరుగులు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా లాభాల్లో ముగియగా, మరో సరికొత్త స్థాయిలకు సూచీలు చేరుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 60.23 పాయింట్లు పెరిగి 32,575.17 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 37.55 పాయింట్లు అందుకుని 10,114.65 వద్ద నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బుధవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరపనున్న క్రమంలో మదుపరులు కీలక వడ్డీరేట్లు తగ్గుతాయన్న బలమైన విశ్వాసంతో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే గత నెల జూలైలో దేశీయ ఆటో రంగ అమ్మకాలు భారీగా పెరగడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. ఆటో రంగ సంస్థల షేర్లన్నీ పెద్ద ఎత్తున లాభాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు మరో ఆల్‌టైమ్-హైని నెలకొల్పాయి. ఇక అంతర్జాతీయంగా అటు ఆసియా మార్కెట్లు, ఇటు ఐరోపా మార్కెట్లు లాభాల్లోనే కదలాడాయి.