బిజినెస్

ఎయిర్ కార్గో సేవల విస్తరణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 6: దేశంలో ఎయిర్ కార్గో సేవలు మెరుగుపరచడం ద్వారా దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించే అవకాశం ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. ఆదివారం ఆయన డెంకాడలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఎయిర్ కార్గో సేవలపై గతంలో అంతగా దృష్టిసారించలేదన్నారు. కేవలం విమాన ప్రయాణికులపై ఆధారపడితే ఆ రంగం అభివృద్ధి సాధించలేదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో భారత్‌లోనే విమాన ప్రయాణికుల వృద్ధిరేటు అధికంగా ఉందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్లను ఖరారు చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. మరో మూడేళ్లలో విమానాశ్రయం రూపుదిద్దుకోనుందన్నారు. నిర్మాణం పూర్తయితే స్థానికులకు ఉపాధి లభించనుందన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పూర్తి కావడానికి ఎనిమిదేళ్లు పట్టిందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరితగతిన నిర్మాణం కానుందని వివరించారు. ఎంపి ల్యాడ్స్ వృథా కాకుండా అవసరమైన చోట వెచ్చిస్తున్నామని, మేటర్నిటి కేంద్రాల్లో చంటి బిడ్డలకు వేడినీళ్లు అవసరమని, అలాంటి ఆసుపత్రుల్లో సౌరవిద్యుత్‌తో వేడినీళ్ల సౌకర్యం కల్పించామని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఎంపి నిధులతో బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. దేశంలో విద్యా ప్రమాణాల మెరుగు అనేది విద్యావేత్తలే నిర్ణయిస్తారని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఏ విధానమైన దేశంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఉండాలని, అలాగే ప్రపంచ దేశాలతో పోటీపడేలా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, కలెక్టర్ వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.