బిజినెస్

రికార్డు దిగుబడులు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి గత ఏదాది సాధించిన 138.04 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి దిగుబడి కంటే ఎక్కువగా ఉండవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభనా కె.పట్నాయక్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం పెరగడం, వరుసగా రెండో సంవత్సరం రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకూ వరి, పప్పుదినుసులు, నూనె గింజలు, పత్తి, చెరుకు, జనుము తదితర పంటల నాట్లు 80 శాతానికి పైగా పూర్తయ్యాయని, మరికొన్ని ప్రాంతాల్లో వచ్చే నెల వరకు నాట్లు కొనసాగుతాయని ఆదివారం పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రస్తుతం కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల వలన దాదాపు 19 లక్షల హెక్టార్ల పంటలకు నష్టం వాటిల్లిందని, ఆయా ప్రాంతాల్లో వరద నీరు తగ్గిన తర్వాత రైతులు ఇతర ఖరీఫ్ పంటలు సాగుచేస్తారని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఏది ఏమైనప్పటికీ గత ఏడాది కంటే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంటుందని కచ్చితంగా చెప్పగలనని ఆయన అన్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరదల వలన కొన్ని రాష్ట్రాల్లో పంటలకు నష్టం వాటిల్లగా, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడం ఆందోళన కలిగిస్తోందని, అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకూ వేసిన పంటల విస్తీర్ణం 3 ఎక్కువగానే ఉందని పట్నాయక్ వివరించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు గత వారం వరకు 878.23 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారని, గత ఏడాది ఇదే కాలంలో ఈ విస్తీర్ణం 855.85 లక్షల హెక్టార్లుగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 266.93 లక్షల హెక్టార్లుగా ఉన్న వరి నాట్ల విస్తీర్ణం ఈ ఏడాది 280.03 లక్షల హెక్టార్లకు, పప్పు దినుసుల సాగు విస్తీర్ణం 116.95 లక్షల హెక్టార్ల నుంచి 121.28 లక్షల హెక్టార్లకు పెరగగా, నూనె గింజల సాగు విస్తీర్ణం మాత్రం 165.49 లక్షల హెక్టార్ల నుంచి 148.88 లక్షల హెక్టార్లకు తగ్గినట్లు ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో నూనె గింజల నాట్లు ఇంకా పూర్తి కాలేదని, కనుక ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని పట్నాయక్ అన్నారు. కందులు మినహా మిగిలిన అన్ని రకాల పప్పు్ధన్యాల సాగు విస్తీర్ణంతో పాటు పత్తి, చెరుకు లాంటి వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.