బిజినెస్

రైతుబజార్లలో కానరాని ఉల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాయకాపురం), ఆగస్టు 7: దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డ ధర ఠారెత్తిస్తుంటే రైతుబజార్లలో ఉల్లి ఊసే లేకుండా పోయింది. కృష్ణా జిల్లాలోని 21 రైతుబజార్లలో సోమవారం ఉల్లిపాయలు కనిపించలేదు. బోర్డుపై రేటు ఉన్నా.. స్టాళ్లలో మాత్రం సరుకు లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో ఉల్లిపాయల ధరలు కేజీ 22 రూపాయలవగా, ప్రకాశంలో 30-35 రూపాయల మధ్య, నెల్లూరులో రూ. 32, అనంతపురంలో రూ. 30, విశాఖ రూ. 28, విజయనగరం రూ. 27, కడపలో రూ. 28కి ఉల్లిపాయల విక్రయం జరిగింది. అధిక శాతం మహారాష్ట్ర నుండి రాష్ట్రంలోని రైతు బజార్లకు ఉల్లిపాయలు దిగుమతి అవుతున్నాయి.
కొన్నిచోట్ల మాత్రం కర్నూలు ఉల్లిని తరలిస్తున్నారు. నిరుడు 19 వేల 124 హెక్టార్ల మేర కర్నూలు జిల్లాలో పంట ఉంటే, ఈ ఏడాది 10 వేల 208 హెక్టార్లలో మాత్రమే ఉల్లి పంట ఉంది. ఒక్కో హెక్టార్‌కు 13 టన్నుల పంట వస్తుంది. ఈ విధంగా డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో రైతుబజార్లలో ఉల్లి కనిపించడం లేదు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోని 108 రైతుబజార్లలో అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
ధరల పెరుగుదల తాత్కాలికమే
మరోవైపు ఉల్లిగడ్డ ధరల్లో పెరుగుదల తాత్కాలికమేనని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభన కె పట్నాయక్ అన్నారు. పరిస్థితిని కేంద్రం నిశితంగా గమనిస్తోందని, హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌లలో ఉల్లి ధరలను పరిశీ లిస్తున్నామన్నారు.
నిజానికి వచ్చే నెల వరకు డిమాండ్‌కు తగ్గ ఉల్లిగడ్డ దేశీయంగానే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. వచ్చే నెల కొత్త పంట మార్కెట్‌లోకి వస్తుందని, దీంతో సహజంగానే ధరలు దిగివస్తాయన్న శాభావాన్ని పిటిఐ వద్ద పట్నాయక్ వెలిబుచ్చారు.