బిజినెస్

భారీగా ఇన్నోవేషన్ ల్యాబ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 7: విద్యార్థుల్లో సృజనను వెలికి తీయడానికి రాష్ట్ర ఇన్నోవేషన్ సొసైటీ విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం గా ఉన్న వివిధ పాఠశాలలు, కళాశాలలు ఇన్నోవేషన్ లేబొరేటరీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయని ఏపి ఇన్నోవేషన్ సొసైటీ సిఇఒ ప్రొఫెసర్ వల్లికుమారి వెల్లడించారు. నీతి ఆయోగ్ సభ్యులతో కలిసి ఆమె సోమవారం విశాఖపట్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నత విద్యామండలి, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అధికారుల సమన్వయంతో ఈ సమావేశం జరిగింది. విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు ఇన్నోవేషన్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకోడానికి ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రొఫెసర్ వల్లికుమారి సూచించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆమె తెలిపారు.
ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు పాఠశాలలకు ఐదేళ్లకుగాను 10 లక్షల రూపాయలు, విశ్వవిద్యాలయాలకు 10 కోట్ల రూపాయలు కేంద్రం సమకూరుస్తుంది. నిరుడు 32 పాఠశాలల్లో, ఒక యూనివర్సిటీలో ఇన్నోవేషన్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారన్నారు. వాటిని ఈ ఏడాది భారీ స్థాయిలో పెంచడానికి ప్రణాళికలు రూపొందించారన్నారు. పాఠశాలల్లో 1,500 చదరపు అడుగులు, విశ్వవిద్యాలయాల్లో 1 0వేల చదరపు అడుగుల్లో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వీటి రిజిస్ట్రేషన్‌కు గడువులోగా అన్ని విద్యా సంస్థలు ముందుకు రావాలని వల్లికుమారి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శ్రద్ధ చూపడం వల్ల కేంద్రం ఈ ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తోందని ఆమె చెప్పారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కొత్త ఆవిష్కరణలపై తరచు సమీక్షలు చేస్తూ అధిక మొత్తంలో ల్యాబ్‌లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. అంకుర సంస్థలు, కొత్త ఆవిష్కరణలకు ఇక రాష్ట్రంలో నూతనోత్సాహం రాబోతోందని ఇందుకు అన్ని విద్యా సంస్థలు సన్నద్ధంగా ఉండాలని ఆమె కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నీతి ఆయోగ్‌కు చెందిన అరణబ్ కుమార్, అయేషా, పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.