బిజినెస్

మళ్లీ కార్ల ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశవ్యాప్తంగా గత నెల జూలై 1న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రావడంతో స్పోర్ట్స్ యుటిలిటి వాహనాలు (ఎస్‌యువి), మధ్యశ్రేణి, భారీ, లగ్జరీ కార్ల ధరలు తగ్గుముఖం పట్టినది తెలిసిందే. అయితే జిఎస్‌టి సెస్సును ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 25 శాతానికి పెంచుతుండటంతో వీటన్నిటి ధరలు పెరగనున్నాయి. సెస్సు పెంపునకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జిఎస్‌టి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జిఎస్‌టి విధానంలో కార్లపై గరిష్ఠ స్థాయిలో 28 శాతం పన్ను పడింది. అదీగాక 1-15 శాతం సెస్సును విధించారు. జిఎస్‌టి అమలుతో రాష్ట్రాలు కోల్పోతున్న ఆదాయానికి నష్టపరిహారం చెల్లించేందుకు వివిధ వస్తువులపై పన్నులతోపాటు అదనంగా ఈ సెస్సును విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ సెస్సును కార్లపై 15 శాతం కాకుండా 25 శాతానికి పెంచాలని జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయించింది. శనివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదించి నిర్ణయం తీసుకుంది. ఇది అమలైతే కార్ల ధరలు మళ్లీ పెరగనున్నాయి.
‘మేక్ ఇన్ ఇండియా’కు విరుద్ధం
జిఎస్‌టి కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయంపట్ల ఆటో రంగ సంస్థలు సోమవారం పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపాయి. తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలకు ఇది విఘాతం కలిగిస్తుందని, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి కూడా విరుద్ధమని పేర్కొన్నాయి. జిఎస్‌టి నేపథ్యంలో చాలా సంస్థలు తమ కార్ల ధరలను తగ్గించాయి. ఇందులో మారుతి నుంచి బెంజ్, ఆడీ, బిఎమ్‌డబ్ల్యు వంటి లగ్జరీ సంస్థలూ ఉన్నాయి. అయితే సెస్సు భారాన్ని పెంచడంతో తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపే వీలుందని ఆటో రంగ సంస్థలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది దేశ జిడిపి వృద్ధిరేటునూ భంగపరుస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. జిఎస్‌టిలో 1,500 సిసి సామర్థ్యానికి పైనున్న భారీతరహా లగ్జరీ కార్లు, ఎస్‌యువిపై 28 శాతం పన్ను విధించారు. మరో 15 శాతం సెస్ అదనంగా వేశారు. అయినప్పటికీ గతంలో పడిన పన్ను కంటే ఇది తక్కువే. ఇంతకుముందు దాదాపు 50 శాతం పన్నుండేది. దాంతోనే ధరలను తగ్గించాయ దాదాపు అన్ని ఆటో రంగ సంస్థలు. కానీ తాజాగా సెస్సు మరో 10 శాతం పెరగడంతో ధరలను పెంచకతప్పని పరిస్థితి నెలకొంది. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి)లో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు.
విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లగ్జరీ, ఆరోగ్యానికి హానికరం చేసే ఉత్పత్తులపై పన్ను కాకుండా, 43 శాతం వరకు అదనపు భారాన్ని సెస్సు రూపంలో మోపింది నరేంద్ర మోదీ సర్కారు.
వీటి ధరలు తగ్గొచ్చు
మరోవైపు ఇడ్లీ/దోశ బటర్ నుంచి కిచెన్ గ్యాస్ లైటర్ వరకు పలు వస్తువుల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిఎస్‌టి కౌన్సిల్ ఈ మేరకున్న ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. శనివారం 20వ సమావేశం జరగగా, వచ్చే నెల 9న హైదరాబాద్‌లో 21వ సమావేశాన్ని జిఎస్‌టి కౌన్సిల్ నిర్వహించనుంది. ఈ సందర్భంగానే జైట్లీ నాయకత్వంలోని కౌన్సిల్.. పనె్నండుకుపైగా వస్తువులపై జిఎస్‌టి పన్నును తగ్గించే వీలుంది. ఇదిలావుంటే నేత, కట్టింగ్, నెట్టింగ్, ఎంబ్రాయిడరీ తదితర వర్కులపై జిఎస్‌టి రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంపట్ల వస్త్ర పరిశ్రమ ఆనందం వ్యక్తం చేసింది. చిన్నచిన్న వర్కర్లకు ఇది ఎంతగా నో కలిసొచ్చే నిర్ణయమని భారతీయ వస్త్ర పరిశ్రమ సమా ఖ్య (సిఐటిఐ) వైస్ చైర్మన్ సంజయ్ కె జైన్ అన్నారు.