బిజినెస్

తపాలా శాఖ దూకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 8: ‘50 రూపాయలతో పొదుపు ఖాతా తెరిస్తే వెంటనే ఎటిఎం కార్డు జారీ. ఆ కార్డుతో ఏ బ్యాంకు ఎటిఎం నుండైనా నగదు సేవలు పొందవచ్చు. ఈ సేవలపై పరిమితి, రుసుము ఉండదు.’ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మాత్రం నిజం. ఈ సేవలు అందిస్తోంది ఎవరో కాదు సాక్షాత్తూ భారత తపాలా శాఖ. పాత పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాల మధ్య బ్యాంకులు భారీగా ఛార్జీలు పెంచిన నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన సామాన్య, మధ్య తరగతి వర్గాలకు తపాలా శాఖ ఆశా కిరణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం ఉత్తరాల బట్వాడా, పార్శిళ్ల సర్వీసులకు పరిమితమైన తపాల శాఖ.. మారుతున్న కాలానికి అనుగుణంగా తన రూపును మార్చుకుంటోంది. రకరకాల సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బ్యాంకులకు సమాంతరంగా ఖాతాదారులను ఆకట్టుకునే దిశగా పరుగులు తీస్తోంది. బ్యాంకుల్లో ఖాతాలు తెరవడంతోపాటు వివిధ సేవలకు భారీగా ఛార్జీలు వడ్డిస్తున్న నేపథ్యంలో సాధారణ, మధ్య తరగతి ప్రజలు నెమ్మదినెమ్మదిగా బ్యాంకులకు దూరమవుతున్నారు. అలా దూరమైనవారు తపాలా కార్యాలయాలకు దగ్గరవుతున్నారు.
ముఖ్యంగా తపాలా కార్యాలయంలో 50 రూపాయలతో పొదుపు ఖాతా తెరిస్తే రూపే ఎటిఎం కార్డును తక్షణమే అందిస్తున్నారు. ఈ కార్డుతో తపాలా శాఖ ఎటిఎంలతోపాటు అన్ని బ్యాంకుల ఎటిఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. విత్‌డ్రా, డిపాజిట్‌లపై ఎటువంటి పరిమితులు, ఛార్జీలు లేవు. దీంతో మధ్య తరగతి ప్రజలు తపాలా ఖాతాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో తపాలా ఖాతాల సంఖ్య 3 కోట్ల 10 లక్షలకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో మరో 60 లక్షలు పెరుగుతాయని తపాలా ఖాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్ రంగం మాదిరిగా తపాలా శాఖ కూడా కోర్ బ్యాంకింగ్ విధానాన్ని (సిబిఎస్) అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ప్రతీ ఖాతా ఆన్‌లైన్ అవుతోంది. బ్యాంకుల మాదిరిగా ఖాతాలకు కంప్యూటర్ ప్రింటింగ్ కూడా చేస్తున్నారు. ఎస్‌ఎంఎస్ అలర్ట్ కూడా ప్రవేశపెట్టింది. ఇక కొద్దిరోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం అన్ని తపాలా కార్యాలయాల్లో ఆధార్ కార్డులు పొందవచ్చునని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లో కొన్ని కేంద్రాలను తొలి దశలో ఎంపిక చేశారు కూడా.
మరోవైపు కడప, కర్నూలు, నెల్లూరుతోపాటు ఒంగోలు, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, అనంతపురంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను తపాలా శాఖ ఏర్పాటు చేయనుంది. ఇక ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులను కూడా త్వరలోనే ఖాతాదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కూడా అనుమతులు జారీ చేయడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని 24 బ్రాంచిల్లో ఈ బ్యాంకులను ఏర్పాటు చేస్తోంది. విశాఖ, విజయవాడ, చిత్తూరులో సివిల్ పనులు కూడా పూర్తి చేసుకుంది. వీటితోపాటు కేంద్రంలోనినరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పింఛను, సుకన్య సమృద్ధి యోజన, మై స్టాంప్, టిటిడి దర్శనం టిక్కెట్లు ఇలా అనేక సేవలను తపాలా శాఖ ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.