బిజినెస్

నా పదవీ కాలం ఎంతో నాకు తెలియదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి పదవిలో చేరే సమయంలో తన పదవీకాలం ప్రభుత్వంతోపాటుగా ముగుస్తుందనే విషయం తనకు తెలియదని ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అరవింద్ పనగరియా చెప్పారు. అమెరికాలో అధ్యాపకుడిగా టీచింగ్‌ను తిరిగి కొనసాగించడం కోసం పనగరియా నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష పదవికి అర్ధంతరంగా రాజీనామా చేయడం తెలిసిందే. అంతేకాదు తాను రాజీనామా చేయడానికి నీతి ఆయోగ్‌లో రెండు అధికార కేంద్రాలుండటం కారణమంటూ వచ్చిన కథనాలను సైతం ఆయన తోసిపుచ్చారు. పాశ్చాత్య దేశాల్లో యూనివర్శిటీలు సెలవులు పొడిగించే విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాయని పనగరియా అంటూ.. ఆ కారణంగానే ప్రధాన మంత్రి కార్యాలయం తన పదవిని 2019 చివరిదాకా కొనసాగించాలని అనుకున్నప్పటికీ ఈ నెలాఖరులో తిరిగి కొలంబియా యూనివర్శిటీలో చేరాలని తాను నిర్ణయించుకున్నట్లు పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2015లో మొదట నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా నియమించినప్పుడు తిరిగి టీచింగ్‌కు వెళ్లే విషయం గురించి మీరు ప్రభుత్వానికి ఎందుకు స్పష్టంగా చెప్పలేదని అడగ్గా, తన పదవీ కాలం ప్రభుత్వంతోపాటుగా ముగుస్తుందనే విషయం అప్పుడు తనకు తెలియదని ఆయన అన్నారు. అంతేకాదు తనను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఎలాంటి లేఖ కూడా లేదని, అలాంటప్పుడు అవన్నీ తనకు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. ప్రధాని కార్యాలయం నుంచి ఒక ఫోన్ కాల్ రాగానే తాను తన అంగీకారాన్ని తెలియజేశానని చెప్పారు. అంతకు మించి తనకే విషయాలు తెలియవన్నారు. తాను నీతి ఆయోగ్‌లో పని చేయాలని అనుకున్నాను కాబట్టే అందుకు అంగీకరించానని చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు తొలి వైస్ చైర్మన్‌గా పనగరియా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, నీతి ఆయోగ్‌లో రెండు అధికార కేంద్రాలు ఉండటమే తాను పదవికి రాజీనామా చేయడానికి కారణమంటూ వచ్చిన వార్తలను పనగరియా నిర్ద్వంద్వంగా ఖండించారు. లెక్కలేనన్ని సందర్భాల్లో నీతి ఆయోగ్‌కు ప్రభుత్వంలోని మిగతా విభాగాలకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, మీరు రాజీనామా చేయడానికి అదే కారణమా అని అడగ్గా, కానే కాదని పనగరియా స్పష్టం చేశారు. ‘మీరు వెళ్లి మా స్ట్ఫాతో మాట్లాడండి.. ఆ వార్తలు రాస్తున్న వాళ్లను అడగండి... నిజమేమిటో తెలుస్తుంది. ఏ సంస్థ కూడా రెండు, మూడు అధికార కేంద్రాలతో నడవదు. ఒక్కటే అధికార కేంద్రం ఉండాలి’ అని పనగరియా స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ లాగానే గతంలో ఉండిన ప్రణాళికా సంఘానికి కూడా ప్రధాన మంత్రే అధ్యక్షుడిగా ఉండగా, ఉపాధ్యక్షుడు వేరే ఉండేవారు. అయితే ప్రణాళికా సంఘానికి సీఈఓ ఉండే వారు కాదు. అలాగే ప్రణాళికా సంఘం చివరి ఉపాధ్యక్షుడైన మాంటెక్ సింగ్ అహ్లూవాలియాలాగానే పనగరియాది కూడా కేబినెట్ ర్యాంకే అయినప్పటికీ పనగరియా ఎప్పుడు కూడా కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొనే వారు కాదు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన మంత్రి కార్యాలయం పాత్ర ఏమీ లేదని, ఆయన స్పష్టం చేశారు. నిజానికి ప్రధాన మంత్రి కార్యాలయం తనను 2019 దాకా ఇక్కడే కొనసాగమని కోరిందని, అయితే యూనివర్శిటీతో మాట్లాడిన తర్వాత సెలవు పొడిగించడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చానని, అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని పనగరియా స్పష్టం చేశారు.