బిజినెస్

రూ.69 కోట్లతో స్వదేశీ దర్శన్ రూ.20 కోట్లతో రివర్ ఫ్రంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం,ఆగస్టు 10: ఎట్టకేలకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తోంది. గోదావరి జిల్లాల్లో సహజసిద్ధ అందాలతో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి పలు భారీ సంస్థలు పోటీపడుతున్నాయి. అఖండ గోదావరి నదీ పరీవాహక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుగా చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గోదావరి నది మహా పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును ప్రకటించారు. ప్రభుత్వం రూ.100 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. అఖండ గోదావరి పర్యాటక కేంద్రంలో ప్రధానంగా గోదావరి నది మధ్యలో ధవళేశ్వరం బ్యారేజికి సమీపంలోవున్న పిచ్చుక లంక ప్రాంతం కేంద్రంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. దాదాపు రూ.కోటి వ్యయంతో పిచ్చుకలంక ప్రాంతాన్ని ఇసుకతో నింపి భూమిని సిద్ధంచేశారు. సుమారు 53 ఎకరాల విస్తీర్ణంలో పిచ్చుకలంక ప్రాంతాన్ని అఖండ గోదావరి అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టుగా రూపొందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వివిధ ప్రాజెక్టులు చేపట్టడానికి ఆసక్తికలిగిన సంస్థలు, వ్యక్తుల నుండి బిడ్లను రాష్ట్ర పర్యాటక శాఖ ఆహ్వానించింది.పిచ్చుకలంక ప్రాంతంలో రివర్ కాటేజీలు, వాటర్ స్పోర్ట్స్, హెలీప్యాడ్, బోట్ షికారు, జెట్టీల నిర్మాణం, హోటళ్లు, పర్యాటక, విహార కేంద్రాలు, సమావేశాల హాళ్ల నిర్మాణం, రెస్టారెంట్లు తదితరాలు నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టులకు ఎంఒయులు కుదుర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరుకల్లా ఎంఒయులు ఖరారు చేసుకుని పనులు మొదలెట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
ఇదిలావుండగా స్వదేశీ దర్శన్ పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో తూర్పు గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 69 కోట్లతో పనులు జరుగుతున్నాయి. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో భాగంగా కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్, ఎస్ యానం, ఆదుర్రు, పాశర్లపూడి ప్రాంతాల పర్యాటక ప్రాజెక్టులు చేపట్టారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రాజమహేంద్రవరం నగరంలోని రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టును రూ.20 కోట్ల నిధులతో చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పుష్కర, మార్కండేయ ఘాట్‌లను పర్యాటకంగా విస్తరిస్తారు. పర్యాటకులకు వౌలిక సదుపాయాలు అభివృద్ధిచేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంలోనే సుమారు ఆరు ఎకరాల సెంట్రల్ జైలు స్థలాన్ని పర్యాటక శాఖకు బదలాయించారు. ఈ భూమిలో రూ.10 కోట్ల అంచనా నిధులతో కనె్వన్షన్ సెంటర్ నిర్మాణ పనులు చేపట్టారు. మంజీరా సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది. నిర్మాణం పూర్తయిన తర్వాత లీజు ప్రాతిపదికన ఎపి టూరిజం సంస్థకు అప్పగించనున్నారు. మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధిచేస్తారు. ఆధ్యాత్మిక టూరిజంలో పలు ఆలయాల అభివృద్ధితో పాటు గోదావరి నది స్నానఘట్టాలను పర్యాటకంగా అభివృద్ధిచేయనున్నారు. మొత్తం మీద ఇటు గోదావరి పరీవాహ ప్రాంతం, అటు సముద్ర తీర ప్రాంతంతో పాటు రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రాజెక్టులతో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు కీలకంగా రూపుదాల్చింది.