బిజినెస్

వేలం ప్రక్రియ ఆపేదిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: మహారాష్టల్రోని పూణె జిల్లాలోగల యాంబీవ్యాలీ ప్రాజెక్టు వేలం ప్రక్రియను నిలిపివేయాలంటూ సహారా అధినేత సుబ్రతారాయ్ చేసిన అభ్యర్థను సుప్రీం కోర్టు గురువారం తిరస్కరించింది. ఈ అభ్యర్థనను విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, రంజన్ గగొయ్, ఎకె సిక్రీలతో కూడిన ధర్మాసనం దీన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది. సహారా అధినేత తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్‌‘ సెప్టెంబర్ వరకూ ఈ వేలం ప్రక్రియను నిలిపివేస్తే సెబి, సహారా ఖాతాలో జమచేయాల్సిన 1500 కోట్ల రూపాయలను నా క్లయింట్ ఏర్పాటు చేయగలుగుతారు’అని కోర్టుకు నివేదించారు. 34వేల కోట్ల రూపాయల యాంబీ వ్యాలీ ప్రాజెక్టు ఆస్తుల వేలం ప్రక్రియను ఆపాలని సుబ్రతారాయ్ బుధవారం నాడే సుప్రీం కోర్టును అభ్యర్థించారు. బాంబే హైకోర్టు అధికారి లిక్విడేటర్ ద్వారా ఈ వేలం ప్రక్రియ జరుగుతోంది. సెప్టెంబర్ 7నాటికి సెబీ, సహారా ఖాతాలో 1500 కోట్ల రూపాయలు జమచేయాలని గత నెల 25న సహార అధినేతను సుప్రీం కోర్టు ఆదేశించింది.