బిజినెస్

267 పాయంట్లు కోల్పోయిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా,ఉత్తర కొరియా మధ్య చెలరేగుతున్న ఉద్రిక్త వాతావరణం ప్రపంచ స్టాక్ మార్కెట్లపైనా పడింది. దీని ప్రభావం ఫలితంగా సెనె్సక్స్ గత నెల రోజుల్లో ఎన్నడూలేని విధంగా 267 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టికూడా 9900 పాయింట్ల దిగువకు చేరుకుంది. ఇటు బిఎస్‌ఇ అటు నిఫ్టిలు గత నాలుగురోజులుగా వరస నష్టాలను చవిచూస్తునే ఉన్నాయి. గురువారం నాటి లావాదేవీల్లో సెనె్సక్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయింది. కొంత మేర కోలుకున్నప్పటికీ లావాదేవీలు ముగిసేనాటికి 266.51 పాయింట్లు కోల్పోయి 31,531.33 వద్ద ముగిసింది. అంటే ఈ లావాదేవీల్లో 0.84 శాతం మేర మార్కెట్ నష్టపోయింది. అలాగే నిఫ్టికూడా 87. 80 పాయింట్లు కోల్పోయి 9,820.25 వద్ద ముగిసింది. టాటామోటర్స్, ఐషర్ మోటర్స్ స్వల్పలాభాలతో బయటపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, సిప్లా, ఎస్‌బిఐ, పవర్ గ్రిడ్ తదితర కంపెనీలు నష్టపోయాయి. సాఫ్ట్‌వేర్ ఎగుమతి సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, టిసిఎస్‌లు స్వల్ప లాభాలు సాధించాయి.