బిజినెస్

రెండోరోజూ కొనసాగిన లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 10: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాలను అందుకోగలిగాయి. అయితే ఉదయం ఆరంభంలో నష్టాల్లో కదలాడిన సూచీలు చివరకు మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. దీంతో సోమవారం భారీ లాభాలను పొందిన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ మంగళవారం ట్రేడింగ్‌లో 83.67 పాయింట్లు పెరిగి 25,772.53 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 21.75 పాయింట్లు అందిపుచ్చుకుని 7,887.80 వద్ద నిలిచింది. క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఐటి, రియల్టీ, టెక్నాలజీ రంగాల షేర్ల విలువ 1.48 శాతం నుంచి 0.47 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.02 శాతం నుంచి 0.75 శాతం వరకు లాభపడ్డాయి. సింగపూర్ సూచీ మాత్రం 0.90 శాతం పడిపోయింది. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మార్కెట్లు 0.89 శాతం నుంచి 1.12 శాతం మేర పెరిగాయి.