బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. గత నాలుగు రోజుల నష్టాలను కొనసాగిస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 317.74 పాయింట్లు పతనమై 31,213.59 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 109.45 పాయింట్లు క్షీణించి 9,710.80 వద్ద నిలిచింది. ఇక ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 1,111.82 పాయింట్లు, నిఫ్టీ 355.60 పాయింట్లు నష్టపోయాయి. గడచిన ఆరు వారాల్లో స్టాక్ మార్కెట్లు నష్టాలను అందుకోవడం ఇదే తొలి వారం. బిఎస్‌ఇలోని సంస్థల మార్కెట్ విలువ ఈ వారంలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు పడిపోయింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, అమెరికా-ఉత్తరకొరియా మధ్య ఆందోళనకర పరిస్థితులు, డొల్ల కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ను సెబీ నిలిపివేయడం వంటి చర్యలు ఈ వారం మార్కెట్ లాభాలను ఆవిరి చేసింది. అంతకుముందు వారం సూచీలు రికార్డు స్థాయి లాభాలను అందుకున్నది తెలిసిందే. కానీ ఈ వారం మొత్తంగా సూచీలు భారీ నష్టాలకే పరిమితమయ్యాయి. మెటల్, ఆటో, పిఎస్‌యు, రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.