బిజినెస్

ఎస్‌బిఐకి కలిసొచ్చిన అనుబంధ బ్యాంకుల విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే దాదాపు మూడింతలు ఎగిసింది. ఈసారి 3,032 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆధారంగా చూస్తే మాత్రం సుమారు ఐదింతలు ఎగిసింది. 2,006 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయనసారి ఏకీకృత నికర లాభం 1,046 కోట్ల రూపాయలు, స్టాండలోన్ నికర లాభం 374 కోట్ల రూపాయలుగా ఉన్నాయ. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ మహిళా బ్యాంక్, మరో ఐదు అనుబంధ బ్యాంక్‌ల విలీనం నేపథ్యంలో మొండి బకాయలు పెరిగినా.. ఎస్‌బిఐ ఏకీకృత లాభం పుంజుకుంది. నిరుడుతో చూస్తే నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ లేదా మొండి బకాయలు) 7.40 శాతం నుంచి 9.97 శాతానికి ఎగబాకాయ. అయతే మొత్తం ప్రొవిజన్లు 26.3 శాతానికి తగ్గాయ.