బిజినెస్

ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదాని పోర్ట్స్
నికర లాభం రూ. 710 కోట్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 12: అదాని గ్రూప్‌నకు చెందిన అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఎపిసెజ్) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 13.65 శాతం పడిపోయ 710.25 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 822.57 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 2,959.63 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,085.14 కోట్ల రూపాయలుగా ఉంది.
అదాని ఎంటర్‌ప్రైజెస్
అదాని ఎంటర్‌ప్రైజెస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో చూస్తే 61.77 శాతం క్షీణించి 141.15 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 369.24 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 8,871.29 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 9,174.06 కోట్ల రూపాయలుగా ఉంది.
క్షీణించిన డిఎల్‌ఎఫ్ లాభం
నిర్మాణ రంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 58 శాతం పడిపోయ 109.01 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 261.85 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఇక ఆదాయం ఈసారి 2,211.24 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,025.58 కోట్ల రూపాయలుగా ఉంది.
యుబిఐ నష్టం రూ. 211 కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ) నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 211.46 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయనసారి సంస్థ లాభం 38.32 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,852. 61 కోట్ల రూపాయలుగా, నిరుడు 2,819.37 కోట్ల రూపాయలుగా ఉంది.
బాయర్ కార్ప్‌సైన్స్
లాభం రూ. 112 కోట్లు
బాయర్ కార్ప్‌సైన్స్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 111.7 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 131.2 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఇక ఆదాయం ఈసారి 753.4 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 874.8 కోట్ల రూపాయలుగా ఉంది.
సిటి యూనియన్ బ్యాంక్
లాభం రూ. 140 కోట్లు
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ సిటి యూనియన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 13.6 శాతం పెరిగి 140.32 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయనసారి సంస్థ లాభం 123.52 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 960.86 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 883.30 కోట్ల రూపాయలుగా ఉంది.