బిజినెస్

విజయనగరంలో జోరుగా సోలార్ పంపుసెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 10: విద్యుత్ ఆదా, కాలుష్య నియంత్రణకు దోహదపడే సోలార్ పంపుసెట్ల వాడకంలో విజయనగరం జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో దూసుకెళ్తోందని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస, కుమిలి గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసిన సోలార్ పంపుసెట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి ఆధ్వర్యంలో పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. వారు ఏర్పాటు చేసుకున్న మోటార్లను ఆయన పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల పగటి పూట విద్యుత్ సమస్య అధిగమిస్తున్నామని, నీటిని పంట పొలాలకు మళ్లించుకుంటున్నామన్నారు. 5 హెచ్‌పి, 3 హెచ్‌పి నాణ్యతతో కూడిన సోలార్ పంపుసెట్లతో ఎటువంటి ఇబ్బందుల్లేవన్నారు. సిఎండి ముత్యాలరాజు మాట్లాడుతూ సాంకేతికపరమైన సమస్యలు తలెత్తిన వెంటనే ఫిర్యాదు చేస్తే సిబ్బంది పరిష్కరిస్తారన్నారు. ఈపిడిసిఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి సోలార్ పంపుసెట్ల కోసం 4,434 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ అవగా, ఇందులో 3,054 దరఖాస్తులు అర్హత సాధించాయన్నారు. ఇప్పటికే 2,234 సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఒక్క విజయనగరం జిల్లాలోనే 647 ఉన్నాయని తెలిపారు. రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నందున ప్రభుత్వం ఆరు వేల సోలార్ పంపుసెట్లు మంజూరు చేసిందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వీటన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ గిరిజన, మారుమూల గ్రామాలకు వీటిని పరిచయం చేయాల్సి ఉందన్నారు. సోలార్ పంపుసెట్ల వాడకంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందులో విజయనగరం జిల్లా ద్వితీయ స్థానంలో ఉందన్నారు. ఈపిడిసిఎల్, నెడ్‌క్యాప్, రైతులు సంయుక్త భాగస్వామ్యంతో ఆశించిన ఫలితాలు వస్తున్నాయన్నారు.