బిజినెస్

‘్ఫర్మా’ కాలుష్యంపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: కాలుష్యం వెదజల్లే రసాయన ఔషధ పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండడంతో ఆ పరిశ్రమలను మూసి వేసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) సిద్ధమైంది. ఈ మేరకు సిపిసిబి దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 450 రసాయన ఫార్మా కంపెనీల యాజమాన్యాలకు షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 28 ఫార్మా కంపెనీలను మూసి వేయాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఈ పరిశ్రమల్లోని ఉత్పత్తులు అమెరికా, కెనడా, యురోపియన్ దేశాలకు ఎగుమతి అవుతాయి. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొత్తం 36 ఫార్మా కంపెనీలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు డ్రగ్స్‌ను ఎగుమతి చేస్తున్నాయి. మరోవైపు దేశంలోనే ఫార్మా కంపెనీల్లో రెండో స్థానంలో ఉన్న పొరుగు రాష్టమ్రైన మహరాష్టల్రోని 28 కంపెనీలను కూడా మూసివేయాలంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాలుష్య రసాయన పరిశ్రమలే కాకుండా డిస్టిలరీస్, థర్మల్ పవర్ ప్లాంట్స్, పేపర్, పల్ప్, షుగర్, అల్యూమినియం పరిశ్రమలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల వల్ల పర్యావరణం కలుషితం కావడంతోపాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ ఫార్మా కంపెనీల్లో ‘ఆన్‌లైన్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ సిస్టం’ను ఏర్పాటు చేసుకోవాలని ఫిబ్రవరి 2014లోనే సిపిసిబి ఉత్తర్వులు జారీ చేస్తూ కంపెనీల యాజమాన్యాలను ఆదేశించింది. అయినా పలు పరిశ్రమలు స్పందించలేదు. కాగా, పరిశ్రమలకు మరికొంత గడువిస్తూ సిపిసిబి మరోసారి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ (వెబ్ కెమెరా, ఫ్లో మీటర్స్) ఏర్పాటు చేసుకోవాలంటూ మార్చి 31, 2015లో నోటీసులు జారీ చేసింది. అయినా కొన్ని ఫార్మా కంపెనీలు స్పందించకపోగా, నిర్లక్ష్యం వహిస్తున్నందుకు జూన్ 30, 2015కు డెడ్ లైన్ విధిస్తూ మరోసారి నోటీసులు జారీ చేసి కంపెనీల మూసివేతకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా, ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోని పరిశ్రమల మూసి వేతకు చర్యలు చేపట్టారు. దేశంలోనే మూడో స్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రాలో భారీ గానే కాలుష్యకారక పరిశ్రమలున్నాయి. వీటిలో తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి థర్మల్ పవర్ హౌజ్ కూడా ఉంది. అయితే దీనిలో కొంత భాగం ఇప్పటికే మూసివేశారు. 1956లో స్థాపించిన ఈ పవర్ హౌస్‌తో వాతావరణం కాలుష్యాన్ని గుర్తించి ఐదు దశాబ్దాల తరువాత మూసివేసినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఆంధ్రాలో మూతపడనున్న పరిశ్రమలు
అనూస్ ల్యాబ్, అకాసిన్ లైఫ్ సైనె్సస్, విమల్ డ్రగ్స్, కెమ్‌కెజా లాబొరేటరీస్, సాయి గ్లూకో ఫార్మా
తెలంగాణలో..
ఈశ్వర్ ఫార్మాస్యూటికల్స్, అనూస్ లాబొరేటరీస్-2, ఆర్‌ఎంఎస్ రీసెర్చ్ ల్యాబ్స్, రెంటాస్ ఫార్మా, నెస్టర్ ఫార్మాస్యూటికల్స్, డెక్సో ల్యాబ్స్, క్యూర్ డ్రగ్స్, సిపియర్ ఆర్గానిక్స్, ఎస్‌ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్, టెక్‌బాండ్ లాబొరేటరీస్, జూపిటర్ బయో సైనె్సస్-2 యూనిట్లు, హెక్సాగాన్ డ్రగ్స్, రిక్లిన్ ఫార్మా, స్టాండర్డ్ ఆర్గానిక్స్, ఏ వన్ ఆర్గానిక్స్, బైడెన్ జెంటివ్, యాగ్‌మాగ్ ల్యాబ్స్, ప్రవా లాబొరేటరీస్, మంతెనా డ్రగ్స్-2 యూనిట్లు, చందక్ లాబొరేటరీస్, సమ్మి బయో ఆర్గానిక్స్ కంపెనీల యాజమాన్యాలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ అయ్యాయని సిపిసిబికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.