బిజినెస్

22న అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ ఐపిఒ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో షెల్ఫ్ స్టేబుల్ నాణ్యత కలిగిన అక్వాకల్చర్ ఉత్పత్తుల ఎగుమతి సంస్థ అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ భారత్‌లో విస్తరణ బాట పట్టింది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తుండగా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ద్వారా 148.77 కోట్ల రూపాయల నుంచి 152.25 కోట్ల రూపాయల మేర నిధుల సమీకరణ చేయనుంది. ఈ నెల 22 (మంగళవారం)న ఫైనాన్సియల్ మార్కెట్లో ప్రవేశిస్తోంది. 10 రూపాయల ముఖ విలువ కలిగిన 87 లక్షల ఈక్విటీ షేర్లతో ఈ ఐపిఒను అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ తీసుకొస్తుండగా, బుక్ బిల్డింగ్ మార్గం ద్వారా ఒక్కో ఈక్విటీ షేరుకు 171-175 రూపాయల ప్రైస్ బ్యాండ్‌తో 152.25 కోట్ల రూపాయల వరకు నిధులను సమీకరించుకోవాలని చూస్తోంది. ఈ మేరకు అపెక్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఐపిఒ ఈ నెల 22న ప్రారంభమై 24తో ముగుస్తుంది. అయతే యాంకర్ ఇనె్వస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం ఈ నెల 21నే తెరువబడుతుందని తెలిపింది.
ఈ షేర్లను ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఈ)ల్లో లిస్ట్ చేయనున్నారు. ఈ తాజా ఇష్యూ ద్వారా సమీకరించే మొత్తాలను నూతన ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఉపయోగించాలని సంస్థ ప్రతిపాదించింది. ఈ యూనిట్‌ను తూర్పుగోదావరి జిల్లాలో 20 వేల మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.