బిజినెస్

ఇన్ఫోసిస్ సంక్షోభంపై మదుపరుల దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితులు ఈ వారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను అత్యధికంగా ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా-ఉత్తర కొరియా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపైనా మదుపరులు, ముఖ్యంగా విదేశీ మదుపరులు దృష్టి సారించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు వెల్లడించే ఆర్థిక ఫలితాలు దాదాపు ముగిసిపోవడంతో మదుపరుల చూపు ఇన్ఫోసిస్ పరిణామాలపైనే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్‌కు దాని సిఇఒ విశాల్ సిక్కా శుక్రవారం రాజీనామా చేసినది తెలిసిందే. సంస్థ బోర్డు మద్దతు సిక్కాకే ఉన్నప్పటికీ.. వ్యవస్థాపకుల నుంచి వస్తున్న విమర్శల మధ్య ఆయన తప్పుకున్నారు. దీంతో తదనంతర పరిణామాలు, ప్రధానంగా కొత్త సారథి ఎవరన్నదానికి సంబంధించిన అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపే వీలుంది. సిక్కా రాజీనామా నేపథ్యంలో ఇన్ఫోసిస్ బోర్డు 13,000 కోట్ల రూపాయల షేర్ బైబ్యాక్ ప్లాన్‌కు ఆమోదం తెలపగా, 11.3 కోట్ల షేర్లను 1,150 రూపాయల చొప్పున కొంటోంది.
శుక్రవారం 923.10 రూపాయల వద్ద షేర్ విలువ ముగియగా, తాజా నిర్ణయంతో ఇన్ఫోసిస్ మదుపరులకు దాదాపు 25 శాతం లాభం చేకూరనుంది. శనివారం తీసుకున్న ఈ నిర్ణయంపై సోమవారం మార్కెట్లు స్పందిస్తాయన్న అంచనాలున్నాయ. మరోవైపు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. డొల్ల కంపెనీలపై విధించిన నిషేధం వ్యవహారం కూడా ట్రేడింగ్ సరళిని పెద్దగానే ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. స్టాక్ మార్కెట్లలో చేరిన 331 అనుమానిత డొల్ల కంపెనీలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించడంతో మదుపరుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగిపోయనది విదితమే. ఈ కారణంగానే అంతకుముందు వారం 5 వారాల వరుస లాభాలకు బ్రేక్ వేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,111.82 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 355.60 పాయంట్లు కోల్పోయాయ. అయతే సెబీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొన్ని కంపెనీలు శాట్‌కు వెళ్లడంతో వాటికి ఊరట లభించడం, అమెరికా-ఉత్తర కొరియా ఆందోళనలు తగ్గుతున్న సంకేతాలు రావడంతో గత వారం సెనె్సక్స్ 311.09 పాయంట్లు, నిఫ్టీ 126.60 పాయంట్లు లాభపడ్డాయ. కాగా, ఇంటర్ గ్లోబ్ ఫైనాన్స్ షేర్ల ట్రేడింగ్‌ను సోమవారం నుంచి పునరుద్ధరిస్తామని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ తెలిపింది. సెబీ నిషేధం విధించిన డొల్ల కంపెనీల్లో ఇది కూడా ఒకటి.
శాట్ తీర్పుతో మళ్లీ దీని ట్రేడింగ్ జరగనుంది. మరోవైపు వర్ష సమాచారమూ ముఖ్యమేనని నిపుణులు అంటున్నారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కుండపోతగా పడుతున్నది తెలిసిందే. దక్షిణాదిలో కూడా ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయ. దీంతో ప్రధాన నదులన్నింటికీ వరదలు పోటెత్తుతుండగా, వర్షాధారమైన దేశీయ వ్యవసాయం బాగుంటుందని, ఈసారి పంటలు బాగా పండుతాయన్న అంచనాల మధ్య మదుపరులు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల షేర్లలో పెట్టుబడులకు ముందుకు రావచ్చని అంటున్నారు. ఇదిలావుంటే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, శుక్రవారం వినాయక చవితి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో ఈ వారం నాలుగు రోజులే ట్రేడింగ్ జరగనుంది.