బిజినెస్

నేడు బ్యాంకుల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: అఖిల భారత సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బ్యాంకు ఉద్యోగులంతా మంగళవారం బంద్ లో పాల్గొనాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) పిలుపునిచ్చింది. ప్రజా వ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలు, మొండి బకాయిలుగా ఉన్న కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం, బ్యాంకిం గ్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకుల సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారని యునైటెడ్ ఫోరమ్ ఎపి, తెలంగాణ యూనిట్ కన్వీనర్ వివిఎస్‌ఆర్ శర్మ సోమవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. గత ఐదేళ్లుగా 2,50,000 కోట్ల రూపాయ ల కార్పొరేట్ రుణాలను మాఫీచేసి ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి కేంద్ర ప్రభుత్వాలు నెట్టాయని తెలిపారు. రుణాలను తక్షణమే వసూలు చేయడానికి బదులు మాఫీ చేయడం వల్ల ప్రజా ధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోందన్నారు. మొండి బకాయిలను వెంట నే వసూలు చేయాలని, ప్రతిపాదిత ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లును ఉపసంహరించుకోవాలని, బ్యాంక్స్ బోర్డు బ్యూరోను రద్దు చేయాలని, అన్ని బ్యాంకుల్లో సరిపడా రిక్రూట్‌మెంట్లు చేపట్టాలని, ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆయ న డిమాండ్ చేశారు. ఒక రోజు సమ్మె సందర్భంగా మంగళవారం అంతటా ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలనీ శర్మ పిలుపునిచ్చారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న యుఎఫ్‌బియు ప్రతినిధులు