బిజినెస్

భారత్ సామర్థ్యాన్ని హరిస్తున్నాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: నానాటికి పెరిగిపోతున్న స్మగ్లింగ్, నకిలీ ఉత్పత్తులు, పైరసీ.. దేశాభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని, ముఖ్యంగా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలన్న భారత ఆకాంక్షను కూలదోస్తున్నాయని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ పరిశ్రమకు స్మగ్లింగ్, నకిలీ ఉత్పాదనలు, పైరసీ అతిపెద్ద సవాల్‌గా మారాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
పొగాకు, మత్తు పానియాలు, ఆటో విడిభాగాలు, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల్లో 2012-2014 మధ్య అక్రమ రవాణా 44.4 శాతం పెరిగినట్లు ‘స్మగ్లింగ్ వ్యతిరేక కమిటీ-ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న నకిలీ ఉత్పత్తులు (సిఎఎస్-సిఎడిఇ)’ పేరిట జరిగిన ఓ అధ్యయనంలో తేలిందని ఫిక్కీ వెల్లడించింది. దీనివల్ల వేల కోట్ల రూపాయల వ్యాపారం, ఆదాయాన్ని భారత్ కోల్పోతుందని తెలిపింది. ‘నేడు ప్రపంచ తయారీ కేంద్రంగా అవతరించే సామర్థ్యం భారత్‌కు ఉంది. అయినప్పటికీ భారీగా పెరిగిపోయిన అక్రమ రవాణా, నకిలీ ఉత్పత్తులు, పైరసీ వల్ల ఆ లక్ష్యం నెరవేరడం లేదు.’ అని ఫిక్కీ వ్యాఖ్యానించింది. ఇతర దేశాల నుంచి పెరిగిపోతున్న స్మగ్లింగ్‌ను మరింత సమర్థవంతంగా అడ్డుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా కనిపిస్తోందని చెప్పింది. స్మగ్లింగ్ ఉత్పత్తుల వల్ల 32,412 కోట్ల రూపాయల విలువైన వ్యాపారం ప్రభావితం అవుతోందని, ప్రభుత్వ ఖజానాకు 13,049 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతోందని ఫిక్కీ తెలిపింది.
అంతేగాక అక్రమ వాణిజ్యం ద్వారా అక్రమ సంపద కూడా పెరుగుతోందని, ఇది తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక బలాన్నిస్తోందని ఆందోళన వెలిబుచ్చింది. నేరాలు పెచ్చుమీరడానికి కారణమవుతోందని చెప్పింది. అక్టోబర్ 12 నుంచి వీటన్నిటిపైనా ‘ఎమ్‌ఎఎస్‌సిఆర్‌ఎడిఇ 2017’ పేరిట రెండు రోజుల సదస్సును నిర్వహించనున్నట్లు ఫిక్కీ ఈ సందర్భంగా ప్రకటన ద్వారా తెలియజేసింది.
ఇందులో ప్రపంచ కస్టమ్స్ సంస్థ, ఇంటర్‌పోల్, ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ, డ్రగ్స్, క్రైమ్ నిరోధక ఐక్యరాజ్యసమితి కార్యాలయం, అమెరికా హోమ్‌లాండ్ సెక్యూరిటీ అధికారులు పాల్గొననున్నారు. స్మగ్లింగ్, నకిలీ ఉత్పత్తులు, పైరసీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వీరంతా చర్చలు జరపనున్నారు. దీంతో ఆయా దేశాల మధ్య దీనిపై సంపూర్ణ సహకారం పెంపొందడానికీ ఈ చర్చలు దోహదపడగలవన్న విశ్వాసాన్ని ఫిక్కీ వ్యక్తం చేసింది.