బిజినెస్

ఐ-ప్యూర్ టెక్నాలజీతో కూలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: ప్రముఖ ఎయిర్ కూలర్ల తయారీ కంపెనీ సింఫనీ లిమిటెడ్ ప్రపంచంలోనే తొలిసారిగా ఐ ప్యూర్ టెక్నాలజీతో తయారు చేసిన వివిధ దశల్లో శుద్ధిచేసిన చల్లని గాలిని అందించే ఎయిర్‌కూలర్లను ఆవిష్కరించింది. ఐ-ప్యూర్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ కూలర్లు అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కలిగి ఉండడంతోపాటు అత్యంత నాణ్యమైన ఫిల్టర్ ప్యాడ్‌లు కలిగి ఉన్నట్లు సింఫనీ సిఎండి అచల్ బకేరి తెలిపారు. కూలర్ నుంచి వీచే గాలి మొత్తం వివిధ దశల్లో ఫిల్టర్ కావడం వల్ల కాలుష్యం పోయి చల్లని ఆహ్లాదకరమైన గాలిని ఐ-ప్యూర్ టెక్నాలజీ కూలర్లు అందిస్తాయని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. దేశంలో కూలర్ల మార్కెట్ గురించి ఆయన వివరిస్తూ మొత్తం మార్కెట్ సైజ్ రూ.3 వేల కోట్లు ఉంటుందని, ప్రతి ఏడాది 15 శాతం మార్కెట్ పెరుగుతోందని తెలిపారు. సిల్వర్ ఐ ఎయిర్ కూలర్‌ను ఐ ప్యూర్ టెక్నాలజీ ద్వారా రూపొందించడం వల్ల ఇండియా డిజైన్ మార్క్ అవార్డును దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు.