బిజినెస్

వచ్చే ఆగస్టు నాటికి.. కాగిత రహిత సంస్థగా ఇపిఎఫ్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశంలోని కార్మికులకు, ప్రత్యేకించి అసంఘటిత రంగ కార్మికులకు ఎనలేని సేవలను అందజేస్తున్న ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) తమ చందాదారులకు మరింత మెరుగైన సేవలను అందజేయడమే లక్ష్యంగా వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కాగిత రహిత (పేపర్‌లెస్) సంస్థగా మారనుంది. కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా లాంటి వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఇపిఎఫ్‌ఓ ఇప్పటికే పిఎఫ్ విత్‌డ్రాయల్స్ లాంటి ఆన్‌లైన్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఇపిఎఫ్‌ఓ పూర్తి కాగిత రహిత సంస్థగా మారేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. దీంతో అవినీతికి, వేధింపులకు తావు లేకుండా కార్మికులు మరింత నాణ్యమైన సేవలను పొందేందుకు వీలవుతుందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విపి.జోయ్ తెలిపారు. తిరంగా యాత్రను ప్రారభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఇపిఎఫ్‌ఓను పూర్తి కాగిత రహిత సంస్థగా మార్చి అన్ని రకాల సేవలను ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో (ఆన్‌లైన్ లేదా మొబైల్ హ్యాండ్‌సెట్ల ద్వారా) అందజేయాలని నిర్ణయించామని, దీంతో చందాదారులు తమ పనులను చేయించుకునేందుకు ఇపిఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.